Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్ భీమ్లా నాయక్ నుండి మరో సింగల్ కి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్లు, పోస్టర్లు సినిమా మీద భారీ అంచనాలు నెలకొల్పగా.. ఆల్బమ్ నుండి వచ్చిన ఫస్ట్ సింగల్ అయితే దుమ్మురేపింది. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్ లో వ్యూస్ పరంగా దూసుకుపోతుండగా ఇప్పుడు సెకండ్ సింగల్ కూడా సిద్ధమైంది. ఈరోజు లేదా రేపో ప్రోమో కూడా బయటకి వచ్చేయనుంది. ఈ మేరకు సినిమా యూనిట్ సోషల్ మీడియాలో రివీల్ చేసింది.
Kiara Advani: ఇండస్ట్రీలో ఉండాలంటే ఏం చేయాలో చెప్పిన కియారా!
ఆల్రెడీ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ రాబోయే పాటను త్రివిక్రమ్ కి వినిపించగా మరో పెద్ద హిట్ అవుతుందని తెలిపారని శాస్త్రి ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు. సంగీత దర్శకుడు థమన్ కూడా దీనిపై ఎగ్జైటెడ్ గా ఉన్నాడు. ఇప్పటికే ప్రోమో సిద్ధం కాగా.. ఈరోజు కానీ రేపు కానీ విడుదల అవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 12న రానున్న ఈ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!
మరోవైపు ఇప్పటికే ఫస్ట్ సింగల్ కి భారీ రెస్పాన్స్ ఇచ్చిన అభిమానులు రానున్న రెండో పాటకి కూడా భారీ రికార్డులు ఇవ్వాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మలయాళంలో భారీ సక్సెస్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సాయం చేస్తున్నాడు.
#AnthaIshtam PROMO LOADING ?✊?❤️#BheemlaNayakSecondSingle ❤️?
From the ❤️Heart of #BheemlaNayak Jungle ? pic.twitter.com/2T1ivpnAR3
— thaman S (@MusicThaman) October 12, 2021