Ghani: గని ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘గని’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రొటీన్ కథాంశంతో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను.....

Ghani Locks Ott Streaming Date

Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘గని’ మంచి అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా రొటీన్ కథాంశంతో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా ఆదరించలేకపోయారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ పడ్డ కష్టానికి మాత్రం ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు అభిమానులు.

Ghani : తెలంగాణలో పాత ధరలతోనే ‘గని’ రిలీజ్.. టికెట్ పెంపు ఉండదు..

అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను థియేటర్లలో కూడా ఎక్కువ మంది చూడలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమాను అందరూ చూసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌కు రెడీ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను ఏప్రిల్ 22న ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతారని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Ghani: గని రిజల్ట్‌పై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్!

వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా, ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి తెరకెక్కించగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. మరి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.