Ram Charan : కడప అమీన్ పీర్ దర్గాకు రామ్‌చరణ్.. ఎప్పుడంటే?
గోబల్ స్టార్ రామ్‌చరణ్ కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్నారు.

Global Star Ram Charan will attend an event in kadapa Ameen Peer Dargah
Ram Charan : గోబల్ స్టార్ రామ్‌చరణ్ కడపలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించనున్నారు. 80వ నేషనల్ ముషాయరా గజల్ ఈవెంట్‌ను దర్గాలో నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్‌చరణ్ హాజరు కానున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ కథానాయిక. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటించారు.
Kanguva Twitter Review : సూర్య ‘కంగువా’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ హిట్టా? ఫట్టా? అంటే?
ఇంకోవైపు చరణ్ ఆర్‌సీ 16 (వర్కింగ్ టైటిల్) మూవీ కోసం సిద్ధమవుతున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీకపూర్ కథానాయిక.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు.
Rahul Vijay : హీరోయిన్స్ తో కలిసి అమెరికా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరో..