RRR: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి..

Rrr
RRR: ఇండియన్ మోస్ట్ అవెయిటెడ్ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఇప్పటికే విడుదలైన పోస్టర్ల నుండి వీడియోల వరకు సినిమా మీద అంచనాలను పెంచేశాయి. దీంతో సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు అతృతతో ఉన్నారు. అయితే.. ప్రేక్షకుల ఆతృతకు తగ్గట్లే సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ప్రేక్షకులను మరింత ఎదురుచూసేలా చేస్తుంది.
RRR Merchandise : జక్కన్న ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు..
అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని మొన్నటి వరకు యూనిట్ చెప్తూ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసి గుమ్మడి కాయ కూడా కొట్టేసిన యూనిట్ ఆ తర్వాత అక్టోబర్ లో విడుదల చేయడం కష్టమేనని.. త్వరలోనే కొత్త డేట్ ఇస్తామని చెప్పింది. అయితే.. ప్రధానంగా వాయిదాకి కారణం.. దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలేనని అనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు తేర్చుకోగా మిగతా రాష్ట్రాలలో కూడా మార్గం సుగమం అవుతుంది.
Evaru Meelo Koteeswarulu: తారక్ షో.. దసరాకి మహేష్.. దీపావళికి ప్రభాస్!
అక్టోబర్ 22 నుండి థియేటర్లు తిరిగి తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దాంతో పెద్ద సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాకు మహారాష్ట్ర మార్కెట్ చాలా అవసరం. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే 2022 సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేయనునట్లు సమాచారం. అయితే, ఇప్పటికే సంక్రాంతిని టార్గెట్ చేసి చాలా సినిమాలు విడుదల తేదీని ఫిక్స్ చేసుకోగా ఆర్ఆర్ఆర్ కూడా అదే ముహూర్తానికి తెస్తారా అన్నది ఆసక్తిగా మారింది.