మరోసారి గోపీచంద్ విలన్ అవతారం.!
ప్రభాస్, గోపీచంద్.. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.

Gopi Chand Going to Be act in fauji Movie
ప్రభాస్, గోపీచంద్.. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. ఇప్పటికే ఈ ఇద్దరు ఓ సినిమా చేశారు. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా గోపీచంద్ విలన్‌గా కనిపించాడు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పటికీ ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు మరోసారి వీళ్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. ప్రభాస్ చేస్తున్న పాన్ ఇండియా మూవీలో గోపీచంద్ విలన్‌గా కనిపించబోతున్నాడట.
ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా చేస్తున్నాడు. అయితే ఫౌజీ మూవీలో గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ వర్షం సినిమాలో గోపిచంద్ విలన్‌గా నటించాడు. హీరోగా హిట్స్ లేకపోవటంతో వర్షం మూవీలో విలన్ ఛాన్స్ రావటంతో ఒప్పుకున్నాడు. అంతేకాదు మహేశ్ బాబు నిజం, తేజ డైరెక్షన్‌లో వచ్చిన జయం మూవీలో కూడా గోపిచంద్ విలన్‌గా యాక్ట్ చేశాడు.
OG shooting update : OG షూట్ కూడా మొదలు పెట్టబోతున్న పవన్.. OG అప్డేట్..
హీరోగా కొన్ని మూవీస్ హిట్ అయినా, తర్వాత వరస ప్లాప్‌లు గోపిచంద్ కెరీయర్‌కు బ్రేక్‌లు వేస్తున్నాయి. కరెక్ట్‌గా ఇలాంటి టైంలో మరోసారి తన స్నేహితుడు ప్రభాస్ సినిమా ఫౌజీలో విలన్‌గా చేయబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
అయితే ఫౌజీ మూవీలో గోపీచంద్ విలన్‌గా చేస్తే మాత్రం మంచి అవకాశాలు వస్తాయంటున్నారు ఫ్యాన్స్. అది పాన్ ఇండియా మూవీ కావడంతో..విలన్‌గా మంచి మంచి రోల్స్ వచ్చిఫుల్ బిజీ అవుతారని కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు.
Pawan Kalyan : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ భేటీ..