OG shooting update : OG షూట్ కూడా మొదలు పెట్టబోతున్న పవన్.. OG అప్డేట్..

పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

OG shooting update : OG షూట్ కూడా మొదలు పెట్టబోతున్న పవన్.. OG అప్డేట్..

Updated On : October 15, 2024 / 9:12 PM IST

పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా లేట్ అవుతుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ మూవీ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు చిత్ర బృందం తెలిపింది. ఓజీ షూట్ మ‌ళ్లీ ప్రారంభించబ‌డింది. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూట్‌లో జాయిన్ కానున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో ప‌వ‌న్ అభిమానులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Pawan Kalyan : ఉప‌ ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పూర్ణా పిక్చర్స్ ఎండీ గ్రంధి విశ్వనాథ్ భేటీ..

Image

ప‌వన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో కీలక బాధ్య‌తలు నిర్వ‌ర్తిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అయితే ఆయన చేతిలో ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు ఉండటంతో అవి ఎలాగైనా పూర్తి చేస్తానని ఫ్యాన్స్ కి మాట ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

దీంతో కుదిరినప్పుడు డేట్స్ ఇస్తూ పవన్ ఆ సినిమాలు పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Bigg Boss 8 : అవినాష్ భార్య గురించి మాట్లాడిన‌ పృథ్వీ.. ఇదేనా నీ సంస్కారం అంటూ వార్నింగ్ ఇచ్చిన అవినాష్