Bhimaa Teaser : గోపీచంద్ ‘భీమా’ టీజర్ వచ్చేసింది..

మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న 'భీమా' టీజర్ రిలీజ్ అయ్యింది.

Gopichand PRIYABHAWANI SHANKAR MALAVIKA SHARMA Bhimaa Teaser released

Bhimaa Teaser : మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీమా’ అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ నుంచి కొన్ని పోస్టర్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాగా ఆకట్టుకున్నాయి. నేడు ఈ మూవీ నుంచి టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

Also read : Yatra 2 : యాత్ర 2 టీజర్ రిలీజ్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..

అయితే ఇది టీజర్ అనడం కంటే గ్లింప్స్ అనడం కారెట్. ఎందుకంటే సినిమా స్టోరీ లైన్ ఏంటో కూడా సరిగ్గా రివీల్ చేయలేదు. జస్ట్ హీరో ఇంట్రడక్షన్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు అంతే. అయితే ఈ గ్లింప్స్ చూస్తుంటే మాత్రం.. మూవీ చాలా పవర్ ఫుల్ గా యాక్షన్ థ్రిల్లర్ గా సాగబోతుందని అర్ధమవుతుంది. కాగా ఈ మూవీలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో KK రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు.