గోపితో జరీన్-మెహరీన్
గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో మొయిన్ హీరోయిన్‌గా మెహరీన్..

గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమాలో మొయిన్ హీరోయిన్‌గా మెహరీన్..
గోపిచంద్ హీరోగా తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. హీరోగా గోపిచంద్ 26వ సినిమా ఇది. దాదాపు రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్‌కి జోడీగా మిల్కీబ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి కానీ, బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్‌ని ఫిక్స్ చేసింది మూవీ యూనిట్. కొద్ది రోజులక్రితం జరీన్ షూట్‌లో జాయిన్ అయ్యింది.
రీసెంట్‌గా మరో హీరోయిన్‌ని కూడా ఫైనల్ చేసారు. పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్, గోపీచంద్ తో జతకట్టబోతుంది. ఈ ఏడాది ఎఫ్2తో సూపర్ హిట్ అందుకున్న మెహరీన్ ఇప్పటివరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ కాగా, జరీన్ సెకండ్ హీరోయిన్ అని మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది. అలాగే తమన్నాకి మెహరీన్ రీప్లేస్ అని కూడా చెప్పారు. 2019 దసరాకి ఈ మూవీ రిలీజ్ చెయ్యనున్నారు. దీని తర్వాత గోపిచంద్, సంపత్ నందితో మరో సినిమా చెయ్యనున్నాడు.. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తుంది.