Ram Charan : బాలీవుడ్‌కి రామ్ చరణ్.. నిర్మాతగా!
నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan).
Gossip Garage is Ram Charan to produce a bollywood film
Ram Charan : నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో పలు సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. తాజాగా ఇండస్ట్రీలో ఓ ఆసక్తికరమైన గాసిప్ హల్చల్ చేస్తోంది. నిర్మాతగా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే కొన్ని హిందీ దర్శకులతో మీటింగ్స్ కూడా జరిగినట్టు టాక్. కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఎంపిక చేస్తూ, బాలీవుడ్లో ఫస్ట్ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
బాలీవుడ్లో చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ బాలీవుడ్ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ అవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా నిజమైతే, రామ్‌చరణ్ కేవలం టాలీవుడ్‌కే కాకుండా బాలీవుడ్లో కూడా తన ప్రభావాన్ని పెంచుకునే దిశగా ఇది పెద్ద స్టెప్ అవుతుందని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
Inaya Sultana: వంపుసొంపులతో కుర్రోళ్లకు నిద్రలేకుండా చేస్తున్న ఇనాయ.. అబ్బా ఏం ఫోజులు!
హీరోగా ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన రామ్‌చరణ్..బాలీవుడ్లో నిర్మాతగా అడుగుపెట్టి సక్సెస్‌కు కేరాఫ్‌గా మారాలని ప్లాన్ చేస్తున్నాడట. చెర్రీ ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారన్న టాక్ నిజమేనా.? కాదా అనేది వేచి చూడాలి మరి.
