Ram Charan : రామ్ చరణ్- సుజీత్ కాంబోపై కొత్త బజ్!
Ram Charan : ఓజీ 2, బ్లడీ రోమియో సినిమాల తర్వాత దర్శకుడు సుజిత్ మరో క్రేజీ కాంబినేషన్‌పై ఫోకస్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
Gossip Garage new buzz around ram charan and sujeeth collaboration
Ram Charan : ఓజీ 2, బ్లడీ రోమియో సినిమాల తర్వాత దర్శకుడు సుజిత్ మరో క్రేజీ కాంబినేషన్‌పై ఫోకస్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు మొదలయ్యాయి. ఇప్పటికే సుజిత్ టేకింగ్, యాక్షన్ ఎలివేషన్‌పై మంచి అంచనాలు ఉండటంతో.. చరణ్‌తో ఆయన సుజీత్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ఇప్పటినుంచే మొదలైందని టాక్.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో ఓజీ- 2 చేస్తున్న సుజీత్.. మళ్లీ మెగా ఫ్యామిలీ నుంచి రామ్‌చరణ్‌తో ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. అయితే చరణ్, సుజీత్ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మాత్రమే. నిజంగానే ఈ కాంబో సెట్ అయితే..సుజీత్ ఎలాంటి కథను సిద్ధం చేస్తారనేది మరింత ఆసక్తికరంగా మారనుంది.
Shriya Saran : ఎరుపు శారీలో నటి శ్రియా.. క్యూట్ ఫోటోలు..
రామ్‌చరణ్‌తో సుజీత్ సినిమా అనే టాక్ ఎప్పటినుంచో ఉంది. సాహో తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని సుజీత్ ఒక కథ సిద్ధం చేశారని అప్పట్లోనే టాక్ వినిపించింది. కానీ కరోనా లాంటి పలు కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని అంటుంటారు. ఓజీ సినిమా హిట్ తర్వాత మరోసారి సుజీత్, రామ్ చరణ్ కాంబోపై టాక్ నడుస్తోంది.
వీళ్లిద్దరు కలిసి భారీ మాస్ యాక్షన్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలో తన 17వ సినిమాకు చేస్తున్నాడు. సుజీత్‌తో సినిమా ఎప్పుడు స్టార్ట్ చూస్తారో వేచి చూడాలి మరి.
