Sree Leela : కమ్ బ్యాక్ కోసం శ్రీలీల ప్రయత్నాలు.!

శ్రీలీల టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన యంగ్ యాక్ట్రెస్.

Gossip Garage Srileela efforts for a comeback

శ్రీలీల టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన యంగ్ యాక్ట్రెస్. ఈ మధ్య ఆమెకు అనుకున్న రేంజ్‌లో సినిమా సక్సెస్‌లు లేవు. స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి.

లేటెస్ట్‌గా జూనియర్ కూడా పెద్ద విజయమేమి సాధించలేకపోయింది. దీంతో శ్రీలీల కెరీర్‌పై చర్చలు స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ, ఈ యంగ్ బ్యూటీ ధైర్యంగా ముందుకు సాగుతూ, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో గట్టిగా బౌన్స్ బ్యాక్ ఇస్తానని ధీమాగా ఉందట. ఆమె ఆశలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపైనే ఉన్నాయట.

Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ మూవీ రివ్యూ.. పవన్ కళ్యాణ్ పీరియాడికల్ యాక్షన్ సినిమా ఎలా ఉందంటే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తన సినీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందని శ్రీలీలకు గట్టిగా నమ్ముతోందట. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో శ్రీలీల పాత్ర పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకునేలా ఉంటుందని, ఆమె ఎనర్జీ, డాన్స్‌తో పాటు నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని టాక్.

గతంలో హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. శ్రీలీల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోందట. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లీక్ అయిన వీడియో క్లిప్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో పవన్‌తో శ్రీలీల కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్.

ఉస్తాద్‌ భగత్‌సింగ్ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, డిసెంబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. శ్రీలీల ఈ సినిమాతో తన కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తెచ్చుకుని, హిట్ హీరోయిన్‌గా నిలదొక్కుకునే ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాతో శ్రీలీల మళ్లీ ఫామ్‌లోకి వస్తుందా లేదా చూడాలి మరి.