Yash : మనసు మార్చుకున్న యష్.. మరోసారి ఆ చిత్రంపైనే ఆశలు?
టాక్సిక్ (Yash) సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన యష్ ఇప్పుడు తన కెరీర్లో మరోసారి KGF మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
Gossip Garrage Yash hopes on KGF Chapter 3 movie
Yash : టాక్సిక్ సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిన యష్..ఇప్పుడు తన కెరీర్లో మరోసారి KGF మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. KGF-3పై యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ మధ్య డిస్కషన్ జరిగాయనే వార్తలు చాలాసార్లు వినిపించాయి.
వరుసగా కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 చేసిన యష్..మధ్యలో టాక్సిక్‌తో ప్రయోగం చేశాడు. అది కాస్త మిస్ ఫైర్ కావడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్టులపై యష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడని టాక్. అందులో భాగంగానే KGF-3ని మళ్లీ లైన్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Alekhya Harika : హాఫ్ శారీలో అలేఖ్య హారిక.. ఎంత అందంగా ఉందో.. ఫోటోలు వైరల్..
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో డ్రాగన్ సినిమా బిజీలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సలార్-2ను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో నీల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ షెడ్యూల్స్‌లో వచ్చే మార్పులను బట్టి, డార్లింగ్ కమిట్మెంట్స్ను బట్టి.. నీల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ట్రాక్ ఎక్కించే అవకాశం ఉందని టాక్.
ఒకవేళ డ్రాగన్ తర్వాత సలార్-2 స్టార్ట్ చేసే పరిస్థితి లేకపోతే..యష్‌తో KGF-3ని పట్టాలెక్కించే ఆలోచన ఉందనే గుసగుసలు ఆసక్తికరంగా మారాయి. నీల్ ముందుగా రాకీ భాయ్తోనే సినిమా చేస్తాడా.? లేక సలార్-2 చేశాకే కేజీఎఫ్-3ని స్టార్ట్ చేస్తాడా అనేది డ్రాగన్ రిలీజ్ అయితే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.
