FTPC : ఎఫ్‌టీపిసి ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్‌గా గొట్టుపర్తి మధుకర్..

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న టాలీవుడ్ నిర్మాత గొట్టుపర్తి మధుకర్.

gottuparthi madhukar took charge ftpc india commity chairman

FTPC : టాలీవుడ్ నిర్మాత గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి) ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. మధుకర్ నిర్మాతగా ఇంద్రాణి, సునామి వంటి సినిమాలతో పాటు పలు చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు ఈ నిర్మాతకు కొత్త భాద్యతలు ఇస్తూ ఎఫ్‌టీపిసి అధ్యక్ష కార్యదర్శలు చైతన్య జంగా, విజయ్ వర్మలు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక ఈ భాద్యత నియామకాన్ని హైదరాబాద్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వహించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ చేతుల మీదుగా గొట్టుపర్తి మధుకర్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఎఫ్‌టీపిసి చైర్మన్ గా పదవి చేపట్టిన గొట్టుపర్తి మధుకర్.. జాతీయ స్థాయిలో సినిమా టెలివిజన్ కి సంబందించిన ఆయా విభాగాల సమస్యల పరిష్కారానికి , సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Also read : Kajal Aggarwal : ఉగాది కానుకగా హారర్ కామెడీ ‘కాజల్ కార్తీక’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

అలాగే అంతరరాష్ట్ర సినీ టెలివిజన్ రంగాల విస్తృత అవకాశాలకై కృషి చేస్తానని చెప్పిన గొట్టుపర్తి మధుకర్.. ఇప్పటికే పది రాష్ట్రాలలో శాఖలను ఏర్పాటు చేసినట్లు, త్వలోనే ఈశాన్య రాష్ట్రాల కమిటీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పుకొచ్చారు. దీనివల్లనట సాంకేతిక అవకాశాలు ఇచ్చిపుచ్చుకొనే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.