Kajal Aggarwal : ఉగాది కానుకగా హారర్ కామెడీ ‘కాజల్ కార్తీక’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

తమిళంలో హిట్టు అయిన కాజల్ అగర్వాల్ 'కరంగాపియం' సినిమాని తెలుగులో 'కాజల్ కార్తీక'గా ఓటీటీలోకి ఉగాదికి తీసుకు రాబోతున్నారు.

Kajal Aggarwal : ఉగాది కానుకగా హారర్ కామెడీ ‘కాజల్ కార్తీక’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Kajal Aggarwal Regina Cassandra Kajal Karthika movie ott streaming details

Updated On : April 8, 2024 / 6:53 PM IST

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా మెయిన్ లీడ్స్ లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, యోగిబాబు.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ్ సినిమా కరంగాపియం. ఈ సినిమాని తెలుగులో ‘కాజల్ కార్తీక’గా గత సంవత్సరం రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ కాబోతుంది.

పదార్తి పద్మజ నిర్మాణంలో దీకే దర్శకత్వంలో ఈ కాజల్ కార్తీక సినిమా తెరకెక్కింది. ఇది కామెడీ హారర్ కథాంశంతో తెరకెక్కించారు. అయిదు వేర్వేరు కథలతో కాజల్ కి, రెజీనాకు సంబంధం ఏంటి అనే పాయింట్ తో హారర్ కామెడీగా సాగనుంది. ఇటీవల హారర్ కామెడీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.

Also read : Inspector Rishi Review : నవీన్ చంద్ర ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ వెబ్ సిరీస్ రివ్యూ.. పర్ఫెక్ట్ హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ అంతే..

ఈ కాజల్ కార్తీక సినిమా హనుమాన్ మీడియా ద్వారా మన తెలుగు ఓటీటీ ఆహాలో ఏప్రిల్ 9న ఉగాది రోజు నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇంకెందుకు ఆలస్యం రేపు పండగ రోజు ఆహా ఓటీటీలో ఈ హారర్ కామెడీ సినిమా చూసేయండి.