Kajal Aggarwal Regina Cassandra Kajal Karthika movie ott streaming details
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా మెయిన్ లీడ్స్ లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, యోగిబాబు.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ్ సినిమా కరంగాపియం. ఈ సినిమాని తెలుగులో ‘కాజల్ కార్తీక’గా గత సంవత్సరం రిలీజ్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ కాబోతుంది.
పదార్తి పద్మజ నిర్మాణంలో దీకే దర్శకత్వంలో ఈ కాజల్ కార్తీక సినిమా తెరకెక్కింది. ఇది కామెడీ హారర్ కథాంశంతో తెరకెక్కించారు. అయిదు వేర్వేరు కథలతో కాజల్ కి, రెజీనాకు సంబంధం ఏంటి అనే పాయింట్ తో హారర్ కామెడీగా సాగనుంది. ఇటీవల హారర్ కామెడీ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.
ఈ కాజల్ కార్తీక సినిమా హనుమాన్ మీడియా ద్వారా మన తెలుగు ఓటీటీ ఆహాలో ఏప్రిల్ 9న ఉగాది రోజు నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇంకెందుకు ఆలస్యం రేపు పండగ రోజు ఆహా ఓటీటీలో ఈ హారర్ కామెడీ సినిమా చూసేయండి.