Sachin Joshi : ప్రముఖ నటుడు సచిన్ జోషికి కండిషన్లతో కూడిన బెయిల్..

ఇతనిపై ఇటీవల కొన్ని నెలల క్రితం మనీ లాండరింగ్ కేసు నమోదయింది. ఈకేసులో అతని ఆస్తులు జప్తు చేసి సచిన్ జోషిని అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి అతను బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు......

Sachin Joshi : ప్రముఖ నటుడు సచిన్ జోషికి కండిషన్లతో కూడిన బెయిల్..

Sachin

Updated On : March 9, 2022 / 1:54 PM IST

 

Sachin Joshi :  ప్రముఖ నటుడు సచిన్ జోషి తెలుగులో ‘మౌనమేలనోయి’ సినిమాతో పరిచయమై ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లో కొన్ని సినిమాలు హీరోగా చేశారు. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి దిగి సినిమాలని నిర్మించారు కూడా. సచిన్ జోషి ప్రముఖ వ్యాపారవేత్త కూడా. ఈయనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఇతనిపై ఇటీవల కొన్ని నెలల క్రితం మనీ లాండరింగ్ కేసు నమోదయింది. ఈకేసులో అతని ఆస్తులు జప్తు చేసి సచిన్ జోషిని అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి అతను బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు.

Pawan Kalyan : యువ క్రికెటర్‌కు పవన్ ఆర్ధిక సహాయం..

తాజాగా సచిన్ జోషికి బెయిల్ మంజూరు అయింది. అయితే కొన్ని కండిషన్లతో ఈ బెయిల్ వచ్చింది. ముంబై హై కోర్ట్ ప్రత్యేక న్యాయమూర్తి 30 లక్షల వ్యక్తిగత బాండ్ మరియు అంత మొత్తానికి ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ ని ఇస్తూ కొన్ని బెయిల్ షరతులతో పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు భారతదేశం విడిచి వెళ్లవద్దని కోర్టు తెలిపింది. అయితే నాలుగు నెలలకు మాత్రమే ఈ బెయిల్ ని మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది.