Multiplex Food : GST తగ్గింది.. మరి మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ రేట్లు తగ్గుతాయా?
ఇటీవల కేంద్రప్రభుత్వం మల్టీప్లెక్స్ లలోని ఫుడ్ మీద GST తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో చాలామంది మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గుతాయని భావించారు.

GST Deduction on Multiplex Theaters Food but no cahnge in price
Multiplex Theaters : గత కొంత కాలంగా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్(Popcorn) రేట్లపై వివాదం సాగుతూనే ఉంది. ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి టికెట్ రేట్లు ఒక కారణం అయితే థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉండటమే అని అటు ప్రేక్షకులు, ఇటు సినిమా పరిశ్రమ వ్యక్తులు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ పెద్దలు కూడా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ రేట్లు తగ్గించాలని కామెంట్స్ చేశారు.
ఇటీవల కేంద్రప్రభుత్వం మల్టీప్లెక్స్ లలోని ఫుడ్ మీద GST తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం ఉన్న GSTని 5 శాతానికి తగ్గించారు. దీంతో చాలామంది మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గుతాయని భావించారు. కానీ తాజాగా ఉన్న రేట్లు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. GST తగ్గినా పాప్‌కార్న్, ఫుడ్ రేట్లు కొంచెం కూడా తగ్గలేదు. బిల్ లో మాత్రం 5 శాతమే GST చూపిస్తున్నారు.
మల్టీప్లెక్స్ లు ఇన్నాళ్లు ఒక పాప్‌కార్న్ రేటు సుమారు 200 అనుకుంటే దానికి 18 శాతం GST వేసి 240కి అమ్మేవారు. ఇప్పుడు GST తగ్గడంతో పాప్‌కార్న్ అసలు రేటు 230కి పెంచి GST 10 రూపాయలు వేసి మళ్ళీ అదే 240 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో GST తగ్గినా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు మాత్రం తగ్గలేదని ప్రేక్షకులు వాపోతున్నారు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మాత్రం దానికి GST తగ్గించడం ఎందుకు, అసలు మల్టీప్లెక్స్ ల మీద యాక్షన్ తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు. దీంతో కేంద్రప్రభుత్వం తమ ప్రయత్నం చేసి GST రేట్లు తగ్గించినా మల్టీప్లెక్స్ లు మాత్రం మారట్లేదు, ఈ పాప్‌కార్న్ రేట్లు తగ్గట్లేదు.
ఇటీవల ముంబైకి చెందిన ఓ ప్రేక్షకుడు ఒక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ తీసుకుంటే దానికి 820 రూపాయలు అవ్వడంతో ఈ డబ్బులతో ఒక సంవత్సరం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవచ్చు అని PVR ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీంట్లో GST రేటు 5 శాతమే ఉన్నా రేట్లు మాత్రం అంతే ఎక్కువగా ఉన్నాయి.