Anand Devarakonda : అనసూయ – విజయ్ ఇష్యూపై మొదటిసారి మాట్లాడిన ఆనంద్ దేవరకొండ.. మొత్తం వన్ సైడ్.. నా ఫ్యామిలీ కోసం నిలబడతాను..

తాజాగా బేబీ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ(Anasuya) - విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇష్యూ గురించి మొదటిసారి మాట్లాడాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ - విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Anand Devarakonda : అనసూయ – విజయ్ ఇష్యూపై మొదటిసారి మాట్లాడిన ఆనంద్ దేవరకొండ.. మొత్తం వన్ సైడ్.. నా ఫ్యామిలీ కోసం నిలబడతాను..

Anand Devarakonda First time spoke about Anasuya Vijay Devarakonda Issue

Updated On : July 13, 2023 / 9:20 AM IST

Anand Devarakonda :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

 

తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆనంద్ దేవరకొండ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ(Anasuya) – విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఇష్యూ గురించి మొదటిసారి మాట్లాడాడు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయ – విజయ్ దేవరకొండ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ఈ విషయాన్ని అర్జున్ రెడ్డి అప్పుడే వదిలేసినా అనసూయ మాత్రం టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక ట్వీట్ చేసి విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టడం, వాళ్ళు అనసూయని ట్రోల్ చేయడం, మళ్ళీ అనసూయ ఫైర్ అవడం.. ఇలా మొన్నటిదాకా కూడా ఈ వివాదం సాగింది. ఇటీవలే అనసూయ ఈ వివాదానికి ముగింపు పలుకుతాను, నాకు మనశ్శాంతి కావాలి అని చెప్పింది.

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ చేసేదానివి అన్నారు.. బేబీ దాకా వచ్చా.. స్టేజి మీద ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..

 

తాజాగా అనసూయ – విజయ్ దేవరకొండ ఇష్యూ గురించి పలు ఇంటర్వ్యూలలో ఆనంద్ దేవరకొండకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. అసలు, దానికి నాకు సంబంధం లేదు. నెగిటివ్ లేదా పాజిటివ్ అనేది పక్కన పెడితే ఇప్పటివరకు అంతా వన్ సైడ్ జరిగింది. వ్యక్తిగతంగా ఆమెపై నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడతాను అని చెప్పాడు. అయితే అనసూయ బేబీ సినిమా ట్రైలర్ గురించి చాలా పాజిటివ్ గా ట్వీట్ చేయడంతో దీనిపై కూడా స్పందిస్తూ.. ట్రైలర్ నచ్చింది, ట్వీట్ చేశారు. అది మంచి విషయమే. సినిమా గురించి ట్వీట్ చేశారు, నా గురించి కాదు అని తెలిపాడు.