Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ చేసేదానివి అన్నారు.. బేబీ దాకా వచ్చా.. స్టేజి మీద ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..

తాజాగా బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేసింది.

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్ చేసేదానివి అన్నారు.. బేబీ దాకా వచ్చా.. స్టేజి మీద ఏడ్చేసిన వైష్ణవి చైతన్య..

Vaishnavi Chaitanya Speech in Baby Movie Pre Release Event

Updated On : July 13, 2023 / 8:17 AM IST

Vaishnavi Chaitanya :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ఎమోషనల్ అయి స్టేజిపైనే ఏడ్చేసింది. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. బేబీ ఒక రియాలిటీ స్టోరీ. మన చుట్టూ ఉండే కథల్లోంచి తీసుకున్న స్టోరీ. చిన్న చిన్న క్యారెక్టర్స్, యూట్యూబ్ లో దొరికిన షార్ట్ ఫిలిమ్స్ అన్ని చేసుకుంటూ వచ్చాను. అలంటి టైంలో నా మీద నాకే కాన్ఫిడెన్స్ లేని టైంలో డైరెక్టర్ సాయి రాజేష్ గారు బేబీ సినిమా తీసుకొచ్చారు. నాలో బేబీ క్యారెక్టర్ చూశాను అన్నారు. నాలోంచి భయం పోగొట్టారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్క అవకాశం వచ్చింది అనిపించింది. ఒక యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చాలామంది చాలా మాటలు అన్నారు. ఈ సినిమాతో ఆ మాటలకి సమాధానం చెప్పాలి అనిపించింది. డైరెక్టర్ సాయి రాజేష్ గారే నాకు ఇందుకు ఫుల్ సపోర్ట్ చేశారు. మా అమ్మ నాన్న నాకు జన్మ ఇస్తే మీరు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. కానీ నిర్మాత SKN గారు, డైరెక్టర్ సాయి రాజేష్ సపోర్ట్ చేశారు అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేసింది.

Anand Devarakonda : మా అన్నయ్య దారి వేరు.. నా దారి వేరు.. విజయ్ దేవరకొండ vs ఆనంద్ దేవరకొండ..

అలాగే.. ఒకప్పుడు ఒక సినిమాలో ఒక నిమిషం క్యారెక్టర్ చేస్తేనే మా వాళ్లందరికీ టికెట్స్ తీసుకొని సినిమాకి తీసుకెళ్లి నేను చేసాను అని చూపించుకున్న. కానీ ఇప్పుడు ఫుల్ సినిమాలో మొత్తం నేనే కనిపిస్తున్నాను. నా ఫస్ట్ సినిమాలో ఒక్క పాట అయినా బాగుండాలి అనుకున్నా. కానీ అన్ని పాటలు బాగా హిట్ అయ్యాయి. సినిమాలో ఓ పెద్ద గోడ మీద నా ఫోటో వేశారు. అది చూసి చాలా ఎమోషనల్ అయ్యాను. ఒక యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏం చేసింది అని బేబీ సినిమాకి వచ్చి చూడండి అని చెప్తూ చాలా ఎమోషనల్ అయింది వైష్ణవి చైతన్య. దీంతో వైష్ణవి స్పీచ్ వైరల్ గా మారింది.