Guntur Kaaram Song : త్రివిక్రమ్ పుట్టిన రోజు నాడు.. ‘గుంటూరు కారం’ దమ్ మసాలా ఫుల్ సాంగ్..

గుంటూరు కారం నుండి చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నిన్న విడుదల చేసింది.

Guntur Kaaram Dum Masala Full Song Release Update

Guntur Kaaram Song Update : మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ మూడో సారి జత కడుతుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటీకే పలుమార్లు వాయిదా పడిన గుంటూరు కారం సినిమా సంక్రాతికి జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు.

ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సాంగ్ దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పినా రిలీజ్ చేయలేదు. ఇటీవల గుంటూరు కారం సాంగ్ అంటూ మసాలా బిర్యానీ.. అనే ఓ పాట లీక్ అయి నెట్టింట వైరల్ అవ్వడంతో చిత్రయూనిట్ ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా.. ప్రోమోని నిన్న విడుదల చేసింది.

Also Read : Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. మరీ ఇంతలా మార్ఫింగ్ చేస్తారా?.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ అమితాబ్ కూడా డిమాండ్..

ఇక ఫుల్ సాంగ్ నవంబర్ 7న రిలీజ్ చేస్తారని ప్రకటించారు. నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు. అంటే త్రివిక్రమ్ పుట్టిన రోజు నాడు గుంటూరు కారం నుండి దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలిపారు. మహేష్ అభిమానులు ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు.