Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. మరీ ఇంతలా మార్ఫింగ్ చేస్తారా?.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ అమితాబ్ కూడా డిమాండ్..

తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Rashmika Mandanna : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. మరీ ఇంతలా మార్ఫింగ్ చేస్తారా?.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ అమితాబ్ కూడా డిమాండ్..

Rashmika Mandanna Fake Morphing Video Goes Viral Fans and Netizens Demands Serious Action

Updated On : November 6, 2023 / 8:11 AM IST

Rashmika Mandanna : రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా తెలుగులో, బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో రణబీర్(Ranbir) సరసన యానిమల్(Animal) సినిమాతో రాబోతుంది. వచ్చే సంవత్సరం పుష్ప 2(Pushpa 2)తో రాబోతుంది. ఇవే కాక రష్మిక చేతిలో ఇంకో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నట్టు సమాచారం. ఇక రష్మికకు ఆన్లైన్ లో, బయట చాలా మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్‌పోజింగ్ చేసినట్టు కనిపిస్తుంది. దీంతో అభిమానులు షాక్ అయ్యారు. రష్మిక ఏంటి ఇలా తయారయి బయటకి వచ్చింది అని ఆశ్చర్యపోతూనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇది ఫేక్ వీడియో అని కొంతమంది కనిపెట్టేసారు.

Also Read : Bigg Boss 7 Day 63 : ఎలిమినేట్ అయిన తేజ.. నువ్వు లేకుండా ఉండలేను అంటూ ఏడ్చేసిన ఆ లేడీ కంటెస్టెంట్..

ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ కి సంబంధించినది. ఆమె వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారు. రష్మిక వీడియో కావడంతో ఇది వైరల్ గా మారింది. పలువురు ఒరిజినల్ వీడియో, రష్మిక మార్ఫింగ్ వీడియో షేర్ చేసి నిజాన్ని బయటపెట్టారు. దీంతో రష్మిక అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ ని కోరుతున్నారు. దీనిపై అమితాబ్ బచ్చన్ కూడా స్పందిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే దీనిపై రష్మిక ఇంకా స్పందించలేదు.