NTR31 : ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన.. గుప్పెడంత మనసు ‘జగతి మేడమ్’..
NTR31 సినిమాలో గుప్పెడంత మనసు 'జగతి మేడమ్' ఛాన్స్ కొట్టేసిందట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియాలో..

Guppedantha Manasu actress Jyothi Rai got chance in NTR31 movie
NTR31 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 31వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర, వార్ 2 సినిమాల తరువాత ఈ మూవీ మొదలు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది..? ఈ మూవీలో ఎవరెవరు నటించబోతున్నారు..? అనే వాటి పై అభిమానులు ఎంతో ఇంటరెస్ట్ తో ఉన్నారు.
కాగా తాజాగా ఈ మూవీలో నటించబోయే ఓ నటి గురించి సమాచారం బయటకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే సూపర్ హిట్ సీరియల్ ‘గుప్పెడంత మనసు’ యాక్ట్రెస్ జ్యోతి రాయ్ అలియాస్ ‘జగతి మేడమ్’.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో అవకాశం అందుకుందట. ఈమె కన్నడ ఆర్టిస్ట్. దీంతో ఈ NTR31 విషయాన్ని కన్నడ మీడియా రాసుకొచ్చింది. ఇక ఆ వార్తని జ్యోతి రాయ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో అది నిజమే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Also read : HanuMan Collections : హనుమాన్ మానియా ఇప్పటిలో తగ్గేలా లేదు.. ఏడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
కాగా ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు గతంలో నిర్మాతలు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు సలార్ 2 వల్ల ఈ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్లడం కష్టంగానే కనిపిస్తుంది. సలార్ 2 పూర్తి అయిన తరువాతే ప్రశాంత్ నీల్.. NTR31 ని స్టార్ట్ చేయనున్నారు. కానీ ప్రభాస్ కి ఉన్న షెడ్యూల్స్ చూస్తుంటే.. సలార్ రెండో పార్ట్ కి మరో ఏడాది సింపుల్ గా పడుతుంది.
ఇక ఎన్టీఆర్ కూడా దేవర పార్ట్ 2, వార్ 2 షూటింగ్స్ తో బిజీగానే ఉన్నారు. దీనిబట్టి చూస్తే NTR31 సెట్స్ పైకి వెళ్లాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. కేజీఎఫ్, సలార్ చిత్రాలా కాకుండా కొత్త జోనర్ తో ఉండబోతుందని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు. తన జోనర్ దాటి ఒక కొత్త ఎమోషన్ తో ఆ సినిమా చేయబోతున్నట్లు, అది ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు.