Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి పెళ్లయిందా? ప్రశాంత్ భార్యని చూశారా? పాపం లేడీ ఫ్యాన్స్..

హనుమాన్ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వైరల్ అయ్యాడు. ప్రశాంత్ కి పెళ్లి అయిందని ఇప్పుడు తెలియడంతో పాపం అతని లేడీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Prashanth Varma : ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి పెళ్లయిందా? ప్రశాంత్ భార్యని చూశారా? పాపం లేడీ ఫ్యాన్స్..

Hanuman Director Prashanth Varma Wife Sukanya going Viral Lady Fans Disappointed

Updated On : January 29, 2024 / 9:46 AM IST

Prashanth Varma : హనుమాన్(Hanuman) సినిమాతో పాన్ ఇండియా వైడ్ ఇప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. ‘అ’ సినిమాతో దర్శకుడిగా మొదలుపెట్టి ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి ఇప్పుడు హనుమాన్ సినిమాతో భారతదేశం అంతా తన గురించి తెలిసేలా చేసి త్వరలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలతో వరల్డ్ వైడ్ టార్గెట్ పెట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ.

హనుమాన్ సినిమా భారీ సక్సెస్ సాధించడంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా వైరల్ అయ్యాడు. అయితే ప్రశాంత్ చూడటానికి కూడా బాగుండటంతో ఇతని ఫోటోలు వైరల్ అయ్యాయి. పలువురు అమ్మాయిలు ప్రశాంత్ కి ఫ్యాన్స్ కూడా అయ్యారు. సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మ హ్యాండ్సమ్ అంటూ పలు పోస్టులు చేశారు. అయితే చాలా మంది ప్రశాంత్ కి ఇంకా పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నారు.

కానీ ప్రశాంత్ కి పెళ్లి అయిందని ఇప్పుడు తెలియడంతో పాపం అతని లేడీ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఇటీవల హనుమాన్ సినిమా భారీ విజయం సాధించినందుకు థ్యాంక్యూ మీట్ పెట్టారు. ఈ ఈవెంట్ కి ప్రశాంత్ భార్య సుకన్య కూడా వచ్చింది. ఈ ఈవెంట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తనకు సపోర్ట్ గా నిలిచినందుకు, సినిమా కోసమే ఎక్కువ టైం ఇచ్చి తనతో ఎక్కువ సేపు గడపకపోయినా అర్ధం చేసుకున్నందుకు భార్యకు థ్యాంక్స్ చెప్పాడు. తేజ సజ్జ కూడా ప్రశాంత్ వర్మ భార్య సుకన్యకు థ్యాంక్స్ చెప్పాడు.

Hanuman Director Prashanth Varma Wife Sukanya going Viral Lady Fans Disappointed

Also Read : Film Fare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. ఫుల్ లిస్ట్.. 12th ఫెయిల్, యానిమల్ హవా..

దీంతో సుకన్య ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో ప్రశాంత్ వెనకే అతని భార్య సుకన్య కూర్చుంది. ఇక తేజ సజ్జ మాట్లాడుతుంటే వీడియోల్లో కూడా సుకన్య కనపడింది. దీంతో సుకన్యని చూసిన వాళ్ళు ప్రశాంత్ వర్మకి ఇంత అందమైన భార్య ఉందా? జోడి భలేగుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ లేడీ ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి అతనికి పెళ్లి అయిపోయిందా అని బాధపడుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సరదాగా మీమ్స్ కూడా చేస్తున్నారు.

Hanuman Director Prashanth Varma Wife Sukanya going Viral Lady Fans Disappointed