Film Fare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. ఫుల్ లిస్ట్.. 12th ఫెయిల్, యానిమల్ హవా..

ఫిలింఫేర్ సినిమా అవార్డుల వేడుక గత రెండు రోజులు గుజరాత్ లో గ్రాండ్ గా జరిగింది.

Film Fare Awards 2024 : 69వ ఫిలింఫేర్ అవార్డ్స్.. ఫుల్ లిస్ట్.. 12th ఫెయిల్, యానిమల్ హవా..

Bollywood Film Fare Awards 2024 Winner Full List 12th Fail Animal Movies gets More Awards

Updated On : January 29, 2024 / 9:00 AM IST

Film Fare Awards 2024 Full List : ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫిలింఫేర్ సినిమా అవార్డుల వేడుక గత రెండు రోజులు గుజరాత్ లో గ్రాండ్ గా జరిగింది. 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ 2024 వేడుక రెండు రోజులు జరగగా మొన్న టెక్నికల్ కేటగిరీల్లో ఫిలింఫేర్ అవార్డుల్ని ప్రకటించారు. ఇక నిన్న యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్ కేటగిరీల్లో అవార్డులు ప్రకటించారు. టెక్నికల్ కేటగిరీల్లో యానిమల్(Animal), జవాన్(Jawan), సామ్ బహదూర్(Sam Bahadur) సినిమాలు హవా చూపించగా నిన్న యానిమల్, 12th ఫెయిల్ సినిమాలు అదరగొట్టాయి.

69వ ఫిలింఫేర్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్..

బెస్ట్ మూవీ – 12th ఫెయిల్
బెస్ట్ మూవీ క్రిటిక్స్ – జొరామ్
బెస్ట్ డైరెక్టర్ – విధు వినోద్ చోప్రా(12th ఫెయిల్ )
బెస్ట్ యాక్టర్ – రణబీర్ కపూర్(యానిమల్)
బెస్ట్ యాక్ట్రెస్ – అలియా భట్(రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ – విక్రాంత్ మెస్సే (12th ఫెయిల్)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – రాణి ముఖర్జీ(మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే), షఫాలీ షా(త్రీ ఆఫ్ అజ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – విక్కీ కౌశల్ (డంకీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – షబానా అజ్మీ(రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని)
బెస్ట్ లిరిక్ రైటర్ – అమితాబ్ భట్టాచార్య(తేరె వాస్తే సాంగ్ – జర హాట్కే జర బచ్కే)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – యానిమల్
బెస్ట్ మేల్ సింగర్ – భూపేందర్ బాబల్(అర్జన్ వేయిలి సాంగ్ – యానిమల్)
బెస్ట్ ఫీమేల్ సింగర్ – శిల్పారావు (చెలెయ – జవాన్)
బెస్ట్ స్టోరీ – అమిత్ రాయ్ (OMG 2)
బెస్ట్ స్క్రీన్ ప్లే – విధు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
బెస్ట్ డైలాగ్ రైటర్ – ఇషితా మొయిత్రా (రాఖీ ఔర్ రాణికీ ప్రేమ్ కహాని)
బెస్ట్ సౌండ్ డిజైన్ – కునాల్ శర్మ(సామ్ బహదూర్), సింక్ సినిమా(యానిమల్)
బెస్ట్ బ్యాజ్ గ్రౌండ్ స్కోర్ – హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే(సామ్ బహదూర్)
బెస్ట్ VFX – రెడ్ చిల్లీస్(జవాన్)
బెస్ట్ ఎడిటింగ్ – జస్కున్వర్ సింగ్, విధు వినోద్ చోప్రా(12th ఫెయిల్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – సచిన్ లోవెల్కర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
బెస్ట్ సినిమాటోగ్రఫీ – అవినాష్ అరుణ్ (త్రి ఆఫ్ అజ్)
బెస్ట్ కొరియోగ్రఫీ – గణేష్ ఆచార్య( వాట్ జుంఖా – రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని)
బెస్ట్ యాక్షన్ – జవాన్

Also Read : Anchor Suma : యాంకర్ సుమ మంచి మనుసు.. డబ్బులు లేవంటే.. ఆ హీరో కోసం ఫ్రీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తానని..

ఓ IPS ఆఫీసర్ బయోపిక్ గా అందర్నీ మెప్పించిన 12th ఫెయిల్ సినిమా అయిదు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ఆ తర్వాత యానిమల్ 5 కేటగిరీలు, రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని 4 కేటగిరీలు, సామ్ బహదూర్, జవాన్ 3 కేటగిరీల్లో, త్రీ ఆఫ్ అజ్ 2 కేటగిరీల్లో అవార్డులు గెలుచుకున్నాయి.