Anchor Suma : యాంకర్ సుమ మంచి మనుసు.. డబ్బులు లేవంటే.. ఆ హీరో కోసం ఫ్రీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తానని..

సోహెల్ సుమ అడ్డా షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Anchor Suma : యాంకర్ సుమ మంచి మనుసు.. డబ్బులు లేవంటే.. ఆ హీరో కోసం ఫ్రీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తానని..

Anchor Suma Supports to Syed Sohel Movie Bootcut Balaraju Doing Pre Release Event without Money

Updated On : January 29, 2024 / 8:09 AM IST

Anchor Suma : ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలకు, అప్పుడప్పుడే వస్తున్న స్టార్ హీరోలకు ఏమి ఆశించకుండా సహాయం చేస్తారు. సినిమా ఈవెంట్స్ కి రావడం, సినిమాని ప్రమోట్ చేయడం, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి కొంతమందికి సపోర్ట్ చేస్తారు స్టార్ సెలబ్రిటీలు. తాజాగా యాంకర్ సుమ ఇలాంటిదే ఓ మంచిపని చేస్తుంది.

యాంకర్ గా, నటిగా దాదాపు ఇరవై ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ మన ఇంట్లో ఆడపడుచు అయిపోయింది. ఇప్పటికి సుమ టీవీ షోలు, సినిమా ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కచ్చితంగా సుమ ఉండాల్సిందే. అయితే యాంకర్ గా సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి బాగానే ఛార్జ్ చేస్తుంది. కానీ ఇటీవల ఓ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్రీగా చేస్తానని మాట ఇచ్చింది.

బిగ్ బాస్(Bigg Boss) తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్(Sohel) ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మిస్టర్ ప్రగ్నెంట్ సినిమాతో మంచి విజయం సాధించాడు సోహెల్. త్వరలో బూట్‌కట్ బాలరాజు(Bootcut Balaraju) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, మూవీ హీరోయిన్ సుమ అడ్డా(Suma Adda) షోకి వెళ్లారు. ఈ షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Madhumani : అప్పుడు ‘సంతోషం’లో నాగార్జున పక్కన.. ఇప్పుడు ‘నా సామిరంగ’లో అమ్మగా..

సోహెల్ సుమ అడ్డా షోలో మాట్లాడుతూ.. రీసెంట్ గా సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశాను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాను. సరే అక్కతో మాట్లాడి చెప్తా అన్నాడు. తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి అక్కా.. నేను అమౌంట్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాను అని చెప్తే.. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేసాను.. అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి సపోర్ట్ చేయడానికే అని నాకు ఫ్రీగా చేస్తాను అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. ఈ బూట్‌కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.