Madhumani : అప్పుడు ‘సంతోషం’లో నాగార్జున పక్కన.. ఇప్పుడు ‘నా సామిరంగ’లో అమ్మగా..
నా సామిరంగ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మధుమణి సినిమా గురించి మాట్లాడి, అనంతరం.. నాగార్జున గారితో కలిసి సంతోషం సినిమాలో నటించాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ లాంటి పాత్రలో నటించాను.

Madhumani Remembers she acted in Santosham after now Mother Character for Nagarjuna in Naa Saami Ranga
Madhumani : కొంతమంది ఆర్టిస్టులు ఒకప్పుడు హీరో ఫ్రెండ్, విలన్, హీరో ఏజ్ తగ్గ పాత్రలు చేసి ఆ తర్వాత తల్లి, తండ్రి పాత్రలు కూడా చేస్తుంటారు. హీరోలు తమ ఏజ్ ని తగ్గించేసుకొని హీరోగా సినిమాలు చేస్తుంటే ఈ ఆర్టిస్టులు వాళ్ళ పక్కనే సీనియర్ నటులు అయిపోతారు. అలా చాలామంది స్టార్ ఆర్టిస్టులు సైతం హీరో ఏజ్ కి తగ్గ పాత్రలు చేసి ఇప్పుడు హీరోలకు సీనియర్ నటులుగా చేస్తున్నారు. అదే కోవలో సీనియర్ నటి మధుమణి కూడా.
తెలుగులో ఒకప్పటి సూపర్ హిట్ సీరియల్ ఋతురాగాలుతో కెరీర్ మొదలుపెట్టిన నటి మధుమణి. సీరియల్స్ లో వరుసగా చేసుకుంటూ ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ ఫ్రెండ్స్ గా, ఫ్యామిలీ మెంబర్స్ గా.. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించింది మధుమణి. ఇటీవలే నా సామిరంగ(Naa Saami Ranga) సినిమాలో నాజర్ సరసన నటించింది. ఒకరకంగా నాగార్జునకి(Nagarjuna) అమ్మ లాంటి పాత్ర చేసింది.
తాజాగా నా సామిరంగ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్లో మధుమణి సినిమా గురించి మాట్లాడి, అనంతరం.. నాగార్జున గారితో కలిసి సంతోషం సినిమాలో నటించాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మ లాంటి పాత్రలో నటించాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగ్ సర్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
Also Read : Brahmanandam : నటన ప్రతి వాడికి రాదు.. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం అదిరిపోయే స్పీచ్.. ఈ వీడియో చూశారా?
సంతోషం సినిమా 2002లో వచ్చింది. ఆ సినిమాలో మధుమణి హీరోయిన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తుల్లో మాలిక అనే పాత్ర పోషించింది. అప్పుడు నాగార్జున ఏజ్ తగ్గట్టు ఆయనకు సమాన ఏజ్ ఉన్న పాత్ర పోషించింది. అప్పట్లో నాగార్జునతో దిగిన ఫోటో గతంలోనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 21 ఏళ్ళ తర్వాత మళ్ళీ నాగార్జునతో నా సామిరంగ సినిమాలో అమ్మ లాంటి పాత్రలో నటించడం గమనార్హం. నాగ్ మాత్రం ఇంకా హీరోగా చేస్తుంటే మధుమణి మాత్రం నాగార్జునకి 21 ఏళ్ళ తర్వాత అమ్మ లాంటి పాత్రలో చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మధుమణి ఇన్నేళ్ల తర్వాత ఈ విషయాన్నీ గుర్తు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.