Hanuman Movie Creates New Record in Zee 5 OTT with in 11 Hours
Hanuman : తేజసజ్జ(Teja Sajja) – ప్రశాంత్ వర్మ(Prasanth Varma) కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటలు రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడమే కాక 50 రోజులు 150 సెంటర్స్ లో ఆడి ఈ రోజుల్లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
సంక్రాంతి సినిమాలన్నీ నెల రోజులకే ఓటీటీలోకి వస్తే హనుమాన్ థియేటర్స్ ఆడుతుండటంతో ఓటీటీలోకి రావడానికి రెండు నెలల సమయం తీసుకుంది. ఇటీవల మొదట హిందీలో జియో సినిమాస్ ఓటీటీలో హనుమాన్ స్ట్రీమింగ్ అవ్వగా, తెలుగులో నిన్న మార్చ్ 17 ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో థియేటర్స్ లో మిస్ అయిన తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న హనుమాన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో అందరూ ఒకేసారి సినిమాని చూస్తున్నారు.
Also Read : Allu Arjun : వైజాగ్‌లో కూడా అల్లు అర్జున్ బిజినెస్.. త్వరలోనే మొదలు..?
దీంతో హనుమాన్ సినిమా ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. హనుమాన్ స్ట్రీమింగ్ మొదలైన 11 గంటల్లోనే 102 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని దాటేసింది. అంతేకాక జీ5 ఓటీటీలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది హనుమాన్ సినిమా. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రావడం, అది కూడా కేవలం 11 గంటల్లోనే అంటే మాములు విషయం కాదు. ఓటీటీలోకి వచ్చిన మొదటి రోజే హనుమాన్ ఈ రికార్డ్ సెట్ చేసింది. ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి. ఓటీటీలో కూడా హనుమాన్ మంచి విజయం సాధిస్తుండటంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Breaking Records & Winning Hearts ❤️#HanuMan Trending #1 Globally with 102MILLION+ Streaming Minutes in less than 11 hours on @ZEE5India ?#HanuManOnZEE5 ?@PrasanthVarma @tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Chaitanyaniran… pic.twitter.com/InIE5D43CA
— Primeshow Entertainment (@Primeshowtweets) March 18, 2024