Allu Arjun : వైజాగ్‌లో కూడా అల్లు అర్జున్ బిజినెస్.. త్వరలోనే మొదలు..?

ఇటీవల పుష్ప సినిమా షూట్ కోసం బన్నీ వైజాగ్ కి వెళ్తే అక్కడ అభిమానులు భారీగా వచ్చి ర్యాలీ తీసుకెళ్లారు.

Allu Arjun : వైజాగ్‌లో కూడా అల్లు అర్జున్ బిజినెస్.. త్వరలోనే మొదలు..?

Allu Arjun will starts his AAA Cinemas Business in Vizag soon

Updated On : March 18, 2024 / 4:43 PM IST

Allu Arjun : సినిమా సెలబ్రిటీలు సినిమాలతో పాటు బిజినెస్ లలో కూడా పెట్టుబడులు పెడతారని తెలిసిందే. ఇటీవల మన హీరోలు ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్ లలో దిగి సక్సెస్ అవుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లో ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి మన హీరోలు థియేటర్స్ మొదలుపెడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ లో మహేష్ బాబు(Mahesh Babu) AMB మల్టీప్లెక్స్, అల్లు అర్జున్(Alu Arjun) AAA సినిమాస్, విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) మహబూబ్ నగర్ లో AVD సినిమాస్.. పేర్లతో మల్టీప్లెక్స్ లు మొదలుపెట్టి దూసుకెళ్తున్నారు.

ఈ మల్టీప్లెక్స్ లు సక్సెస్ గా నడుస్తున్నాయి. త్వరలో రవితేజ కూడా ART సినిమాస్ అనే మల్టీప్లెక్స్ హైదరాబాద్ దిల్‌షుఖ్ నగర్ లో ప్రారంభించబోతున్నారు. అయితే అల్లు అర్జున్ తన AAA సినిమాస్ బిజినెస్ ని వైజాగ్ లో కూడా మొదలుపెట్టబోతున్నారు. ఇటీవల పుష్ప సినిమా షూట్ కోసం బన్నీ వైజాగ్ కి వెళ్తే అక్కడ అభిమానులు భారీగా వచ్చి ర్యాలీ తీసుకెళ్లారు. వైజాగ్ లో కూడా సినిమా బిజినెస్ భారీగా నడుస్తుంది.

Also Read : Tillu Square : ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు ఏకంగా 5 గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారా?

త్వరలో వైజాగ్ లో ఇన్‌ఆర్బిట్ మాల్ రానుంది. ఈ మాల్ లో అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ తో కలిసి AAA సినిమాస్ ప్రారంభించబోతున్నారు అని తెలుస్తుంది. హైదరాబాద్ AAA సినిమాస్ చూడటానికి చాలా లగ్జరీగా, క్లాసీ లుక్స్ తో, అల్లు అర్జున్ ఫొటోలతో చాలా బాగుంటుంది. అదే రేంజ్ లో వైజాగ్ లో కూడా ప్లాన్ చేస్తుండటంతో అక్కడి అభిమానులు సంతోషిస్తున్నారు. వైజాగ్ లో కూడా AAA సినిమాస్ ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని అక్కడ అభిమానులు ఎదురుచూస్తున్నారు.