Hanuman : కేంద్రమంత్రి అమిత్ షాతో.. ‘హనుమాన్’ టీం భేటీ..

కేంద్రమంత్రి అమిత్ షాని కలుసుకున్న 'హనుమాన్' టీం భేటీ. 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా..

Hanuman Movie team Prasanth Varma Teja Sajja met Amit Shah

Hanuman : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జని సూపర్ హీరోగా చూపిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘హనుమాన్’. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం.. 350 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడమే కాదు, 150 సెంటర్స్ లో 50 రోజులు ప్రదర్శితమయ్యి అదుర్స్ అనిపిస్తుంది. మొన్న వచ్చిన శివరాత్రి రోజున కూడా ఈ మూవీకి అదిరిపోయే కలెక్షన్స్ రావడం విశేషం. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీ టీం కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రశాంత్ వర్మ, తేజసజ్జ అమిత్ షాని కలుసుకున్నారు. 50 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షాకి హనుమాన్ ప్రతిమని అందించి తమ సంతోషాన్ని తెలియజేసారు. హనుమాన్ మూవీ గురించి అమిత్ షా మాట్లాడిన మాటలు, అలాగే ఆయన ఇచ్చిన స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..

కాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. హిందీ వర్షన్ కి సంబంధించి ఓటీటీ అండ్ టీవీ స్ట్రీమింగ్ ని తెలియజేసేసిన చిత్ర యూనిట్.. తెలుగు, కనడ, తమిళ్, మలయాళం భాషలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని మాత్రం తెలియజేయలేదు. జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకు వస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు