HanuMan : అయోధ్య గుడికి మాత్రమే కాదు.. భద్రాచలంతో పాటు మరికొన్ని రామమందిరాలకు విరాళాలు..

అయోధ్య గుడికి మాత్రమే కాకుండా భద్రాచలంతో పాటు మరికొన్ని రామమందిరాలకు కూడా హనుమాన్ టీం విరాళాలు అందించబోతున్నారట.

HanuMan team donation to ram mandir ayodhya with bhadrachalam temple

HanuMan : తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం.. ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని నమోదు చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ 250 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని క్రాస్ చేసేసి 300 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.

కాగా ఈ మూవీ కి అమ్ముడుపోయిన ప్రతి టికెట్ డబ్బులు నుంచి ఒక ఐదు రూపాయిలను అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ఇస్తామంటూ నిర్మాతలు తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఇప్పటివరకు ఐదు కోట్ల వరకు రామ మందిరానికి విరాళం అందజేశారు. అయితే కేవలం అయోధ్య గుడికి మాత్రమే కాకుండా భద్రాచలంతో పాటు మరికొన్ని రామమందిరాలకు కూడా విరాళాలు అందించబోతున్నారట.

Also read : Animal : యానిమల్‌లో నాన్న సెంటిమెంట్.. నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో గమనించారా?

నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘మనం ఇంత మొత్తాన్ని అయోధ్యకి మాత్రమే ఇస్తున్నాము. మనకి భద్రాచలం వంటి రామ మందిరాలు కూడా ఉన్నాయి కదా’ అని ప్రశ్నించగా, నిరంజన్ రెడ్డి బదులిస్తూ.. “భద్రాచలంతో పాటు మన రాష్ట్రాల్లోని మరికొన్ని రామమందిరాలకు కూడా విరాళాలు ఇద్దాం” అని మాట ఇచ్చారట. అంతేకాదు, ఈ సినిమా మీద వచ్చిన డబ్బుని ఏ ఇతర బిజినెస్‌ల్లో పెట్టకుండా.. మళ్ళీ సినిమాలు, టెంపుల్స్ కోసం ఉపయోగిస్తానని నిర్మాత పేర్కొన్నారట.

ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ఓవర్ సీస్ మార్కెట్ లో స్టార్ హీరోల రికార్డులు బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అమెరికాలో ఈ సినిమా ఇప్పటివరకు 5 మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ చిత్రం ఇప్పటివరకు అక్కడ ఉన్న అలవైకుంఠపురంలో, రంగస్థలం, భరత్ అనే నేను, సాహో, ఆదిపురుష్ సినిమాలు రికార్డులను బ్రేక్ చేసేసింది.