Animal : యానిమల్‌లో నాన్న సెంటిమెంట్.. నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో గమనించారా?
యానిమల్ సినిమాలో 'నాన్న' అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? ఇప్పుడు సినిమా మొత్తం చూసి కౌంట్ చేయాలా? అనుకుంటున్నారు కదా.. వైరల్ అవుతున్న వీడియో చూడండి సరిపోతుంది.

Animal
Animal : రణ్‌బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ డిసెంబర్ 1 న విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో నాన్న అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేస్తున్నారు జనం. అలా లెక్కపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gaami : అఘోర లుక్‌లో విశ్వక్ సేన్.. ‘గామి’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..
ప్రేక్షకులు సినిమాల్లోని కొన్ని అంశాల్ని మరీ నిశితంగా పరిశీలిస్తారు. థియేటర్లలో కూడా గమనించలేకపోయిన కొన్ని విషయాల్ని ఓటీటీల్లో చూసి వైరల్ చేస్తున్నారు. జనవరి 26న యానిమల్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేశారు. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, బబ్లూ పృథ్వీరాజ్, బాబీ డియోల్ నటించిన ఈ సినిమా చాలానే విమర్శలు ఎదుర్కుంది. వయోలెన్స్ ఉందని, మహిళల్ని తక్కువ చేసి చూపించారని చాలామంది మండిపడ్డారు. అయితే థియేటర్లో మిస్ అయిన కొన్ని సీన్స్ ఓటీటీకి యాడ్ చేస్తారని చాలామంది ఎదురుచూసారు. కానీ సెన్సార్ ఫుటేజ్‌తో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమాలో ‘నాన్న’ అనే పదం ఎన్నిసార్లు పలికారో ఓపికగా కౌంట్ చేసి మరి నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మొత్తంగా 196 సార్లు నాన్న అనే పదం వస్తుందట.
Robert De Niro : 79ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడంపై.. ఆస్కార్ నటుడు రియాక్షన్..
గతంలో రణ్‌బీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్రలో కూడా ‘శివ’ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ‘పాదఘట్టం’ అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో కూడా కౌంట్ చేశారు. ప్రస్తుతం యానిమల్ సినిమాకి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Papa. #Animal
Another painstaking edit by @teluguochu pic.twitter.com/zSOCWKNmcl
— idlebrain jeevi (@idlebrainjeevi) January 27, 2024