Gaami : అఘోర లుక్‌లో విశ్వక్ సేన్.. ‘గామి’ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..
కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న 'గామి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అఘోరగా విశ్వక్ సేన్..

Vishwak Sen first look poster released from Gaami movie
Gaami : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. వరుస సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వక్ చేతిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, VS10 చిత్రాలు ఉన్నాయి. అయితే వీటిలో గామి సినిమా ఎప్పటి నుంచో సెట్స్ పైనే ఉంది. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్న ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ తప్ప, ఒక్క ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయలేదు.
తాజాగా మూవీ టీం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ సినిమాలో విశ్వక్ అఘోర లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో అఘోరగా విశ్వక్ భయపెడుతున్నారు. పోస్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ పోస్టర్ పై రాసిన ఒక కొటేషన్.. సినిమాపై ఆసక్తిని కలగజేస్తుంది. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే” అంటూ మూవీ పై ఇంటరెస్ట్ ని కలగజేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేసిన కంగువ బాబీ డియోల్ పోస్టర్ లా కనిపిస్తుందని పేర్కొన్నారు.
Also read : Robert De Niro : 79ఏళ్ళ వయసులో తండ్రి అవ్వడంపై.. ఆస్కార్ నటుడు రియాక్షన్..
#Gaami – ??? ??????? ???? ?? ????? ?????. ??? ??????? ?????? ?? ????, ????? ????? ☯️
A unique tale of one man and his journey to conquer his biggest fear ?
In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv
— UV Creations (@UV_Creations) January 28, 2024
ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. చాందిని చౌదరి ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ చేస్తుండగా, అభినయ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. విద్యాధర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమా రిలీజ్ బాద్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు. కాగా త్వరలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది.
మరి రెండిటిలో ఏది ముందుగా వస్తుందో చూడాలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విషయానికి వస్తే.. మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ గ్రే క్యారెక్టర్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఈ సంవత్సరం మార్చి 8న విడుదల కాబోతుంది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంటే మరో నటి అంజలి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.