Happy Birthday Sonu Sood
Happy Birthday Sonu Sood: జూలై 30.. నటుడు, గొప్ప మానవతావాది సోనూ సూద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షల వెల్లువతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్‌లు.. ఇలా ‘రియల్ హీరో, దైవం మనుష్య రూపేణా’.. అంటూ సామాన్యులు మొదలుకుని సెలబ్రిటీల వరకు వివిధ భాషల, ప్రాంతాలవారు ఆయనకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఆయన రీల్ లైఫ్‌లో కానీ.. రియల్ లైఫ్‌లోమాత్రం గొప్ప మనసు ఉన్న ఓ శిఖరం. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్.. ఇంకా ఏ మ్యాన్ ఉంటే వాళ్లు.. ఎవరూ సోనూసూద్‌కు సరిపోరు. ఇది సోషల్ మీడియాలో ఆయన నుంచి సాయం పొందిన వారు, ఆయన చేసిన సాయం చూసిన వారు చెబుతున్న మాట.
Sonu Sood : హెయిర్ కటింగ్‌పై సోనూసూద్ మెళకువలు!
ఈరోజు (జూలై 30) ఆయన పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన బాలీవుడ్ నటుడే అయినా యావత్ సినీ ప్రపంచాన్ని ఈరోజు తల ఎత్తుకునేలా చేశారు సోనూ సూద్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సోనూ సూద్.. విరామం లేకుండా తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
Sonu Sood : బచ్చన్ ఫ్యామిలీ గురించి ‘రియల్ హీరో’ ఏం చెప్పారంటే..