Sonu Sood : హెయిర్ కటింగ్‌పై సోనూసూద్ మెళకువలు!

‘రియల్ హీరో’ సోనూ సూద్ హెయిర్ స్టైలింగ్ గురించి మెళకువలు నేర్పుతున్నారు..

Sonu Sood : హెయిర్ కటింగ్‌పై సోనూసూద్ మెళకువలు!

Sonu Sood

Updated On : July 29, 2021 / 1:38 PM IST

Sonu Sood: రియల్ హీరో సోనూ సూద్ గతేడాది లాక్‌డౌన్ స్టార్ట్ అయినప్పటి నుండి చేతికి ఎముక లేదు అనే విధంగా పలు రకాలుగా ప్రజలకు సేవలందిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ.. సోషల్ సర్వీస్‌కి ఎక్కడా ఆటంకం కలుగకుండా ప్లాన్ చేసుకుంటున్నారు.

Actor Sonu Sood : సోనూసూద్ కోసం 1200 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలతో ఆకట్టుకుంటున్నారు సోను. తందూరీ రోటీ తయారీ, మిల్క్ మ్యాన్‌తో ముచ్చట్లు, ఫరా ఖాన్‌తో సందడి చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడాయన సరికొత్త అవతారమెత్తారు. హెయిర్ స్టైలింగ్ గురించి మెళకువలు నేర్పుతున్నారు.

Sonu Sood : హైదరాబాద్‌లో జ్యూస్ అమ్ముతున్న సోనూసూద్.. నువ్వు దేవుడు సామీ…

‘హెయిర్ స్టైలింగ్ ఇంపార్టెంట్ ఆర్ట్.. హెయిర్‌ని స్టైల్‌గా సెట్ చెయ్యడం, దాని గురించి తెలుసుకోవడం, ఇతరులకు చెప్పడం నాకు బాగా ఇష్టం’ అంటూ బట్టతల ఉన్న వ్యక్తికి హెయిర్ స్టైలింగ్ చేశారు సోను. #supportsmallbusiness #supportlocal #support #hairstyles #haircut అనే హ్యాష్ ట్యాగ్లతో హెయిర్ స్టైలింగ్ వర్కర్స్‌ను ఎంకరేజ్ చెయ్యాలంటూ వీడియో షేర్ చేశారు రియల్ హీరో.