వరల్డ్‌వైడ్‌గా అభిమానుల ఆదరణ అందుకుంటూ సంచలన విజయాలు సాధిస్తున్న రెబల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. కొద్ది సంవత్సరాల క్రితం వరకు అతనొక హీరో.. అభిమానులకు ‘రెబల్ స్టార్’.. ఇప్పుడు ‘గ్లోబల్ స్టార్’.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ ఉప్పలపాటి ప్రభాస్ రాజు 40వ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23)..
‘ఈశ్వర్’ తో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, ‘రాఘవేంద్ర’ తో కొత్త రోల్ రుచి చూసి, ప్రేక్షకుల ప్రేమ ‘వర్షం’లో తడిసి, ఫ్యామిలీ ఆడియన్స్ మనసుల్లో ‘చక్రం’ తిప్పి, ‘ఛత్రపతి’ అంటూ మాస్ ధోరణిలో మీసం మెలితిప్పి ‘పౌర్ణమి’తో పాటపాడి, ‘యోగి’ లా ఆటలాడి, ‘మున్నా’ గా మురిపించి, ‘బుజ్జిగాడి’ గా బుజ్జగింపు చూపించి, ‘బిల్లా’ గా స్టైల్ ఖిల్లాని టచ్ చేసి, ‘ఏక్ నిరంజన్’ ఎవరూ లేరంటూ ఏడిపించి, ‘డార్లింగ్’ గా లవ్ చేసి, ‘Mr.పర్ఫెక్ట్’ గా మనసుదోచి, ‘రెబెల్’ గా రఫ్ఫాడించి, ‘మిర్చి’ తో బాక్సాఫీస్ కలెక్షన్ల కుర్చీపై కూర్చుని, ‘బాహుబలి’ తో తెలుగు సినిమా సత్తా చాటి, ‘సాహో’ తో ప్రపంచ సినీ ప్రేక్షకులతో సలాం కొట్టించుని.. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిచెప్పాడు ప్రభాస్..
ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తెలుగు సినిమా రూ. 100 కోట్లు వసూలు చేస్తే అబ్బో గొప్ప అనుకుంటున్న టైమ్‌లో.. 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు వంటి మైలు రాళ్లను సునాయాసంగా దాటి ఇండియా లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సెకండ్ సినిమాగా నిలిచిన కలెక్షన్ల సునామి ‘బాహుబలి’ ప్రభాస్..
Read Also : మత్తు వదలరా – ఫస్ట్ లుక్
ఇప్పుడు ఇండియా వైడ్ ఏ సినిమా రికార్డుల గురించి అయినా మాట్లాడాల్సి వస్తే మొట్టమొదటిగా చెప్పే మాట.. ‘నాన్ బాహుబలి రికార్డ్’ అనుకునేంతగా, మళ్లీ ఆ రికార్డులను బద్దలు కొట్టడం తనకే సాధ్యం అన్నంతగా బాక్సాఫీస్ వద్ద బెంచ్ మార్క్ సెట్ చేశాడు.. ‘సాహో’తో మరోసారి తన సత్తా చాటాడు.. తొలిరోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ‘సాహో’. బాలీవుడ్‌లో రూ.153కోట్ల వసూళ్లను సాధించి మరోసారి అక్కడ తన స్టామినా చూపించాడు. ప్రపంచ వ్యాప్తంగా రూ.425 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.
రెండు వరుస బ్లాక్‌బస్టర్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ నెలాఖరు నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సినిమా సినిమాకు హీరోగా తన రేంజ్‌ను పెంచుకుం టున్న ప్రభాస్ ఇమేజ్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఆడియెన్స్‌లో అంతకంతకు పెరుగుతూనే ఉంది. తన మైనపు బొమ్మను టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టేంత క్రేజ్ సంపాదించుకుని, ఇండస్ట్రీలో అందరితో ఫ్రెండ్లీగా వుంటూ అందర్నీ ఆప్యాయంగా ‘డార్లింగ్’ అని పలకరించే ప్రభాస్‌ని అందరూ ఎంతో ఇష్టపడతారు. తనతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనుకుంటారు.. వరల్డ్‌వైడ్‌గా అభిమానుల ఆదరణ అందుకుంటూ సంచలన విజయాలు సాధిస్తున్న రెబల్‌స్టార్ ప్రభాస్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు..