Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో.. హరిహర వీరమల్లు దర్శకుడు కూడా..

రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో హరిహర వీరమల్లు దర్శకుడి పేరు కూడా వినిపించింది. నేడు డైరెక్టర్ క్రిష్ పోలిసుల విచారణకు..

Hari Hara Veera Mallu director Krish Jagarlamudi Name In Radisson Drugs Case

Krish Jagarlamudi : రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసు గత రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. విచారణలో ఒక్కో పేరు బయటకి వస్తూ ఉంది. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు ఈ డ్రగ్స్ కేసులో వినిపించింది. ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. అలా అటెండ్ అయిన వారిలో దర్శకుడు క్రిష్ కూడా ఉన్నారట.

పోలీసుల దర్యాప్తులో క్రిష్ పేరు కూడా బయటకి రావడంతో.. ఆయన విచారణకు పిలిచారు. అయితే పోలీసులు పిలిచినప్పుడు క్రిష్ ఆఫ్ స్టేషన్ లో ఉండడంతో విచారణకు రాలేకపోయారు. నేడు గచ్చిబౌలి పోలీసుల ముందు క్రిష్ హాజరు అయ్యో అవకాశం ఉంది. కాగా ఆరోజు రాడిసన్ హోటల్ లో జరిగిన పార్టీకి తాను వెళ్లినట్లు క్రిష్ ఇప్పటికే ఒప్పుకున్నారు. కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని వెల్లడించారు.

Also read : Anupama Parameswaran : ఆ జంతువుని బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటున్న అనుపమ..

మరి ఆయన డ్రగ్స్ తీసుకున్నారా..? లేదా..? అనేది పోలీసులు విచారణలో తెలియాలి. ఈ కేసులో మరికొంతమంది కొత్త పేర్లని కూడా చేర్చి పోలీసులు విచారణని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసులో మరికొంత మంది ఉన్నారన్ని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. ఈ కేసులోని ఇద్దరు పరారీలో ఉన్నారని తెలియజేసారు. కాగా రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ ని అబ్బాస్ అనే వ్యక్తి సరఫరా చేసాడు. డ్రగ్స్ తీసుకున్న వారిని విచారిస్తూనే.. డ్రగ్స్ నెట్వర్క్ పై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు.

కాగా క్రిష్ జాగర్లమూడి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవన్ పాలిటిక్స్ లో బిజీ అవ్వడంతో.. ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. దీంతో క్రిష్ ఈ సినిమాని పక్కన పెట్టి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అనుష్కతో ఓ మూవీని స్టార్ట్ చేసారని టాక్ వినిపిస్తుంది. అయితే నిర్మాతల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాచారం రాలేదు.