Hari Hara Veera Mallu latest update
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పిరియాడికల్ కథాంశంతో భారీ బుడ్జెక్టు తెరకెక్కుతున్న సినిమా ‘హరి హర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఏ ఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. అయితే పవన్ రాజకీయలో క్రియాశీలకంగా మారడంతో.. సినిమా చిత్రీకరణ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.
Pawan Kalyan : అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.. పవన్ కళ్యాణ్!
తాజాగా ఈ సందేహాలకు చెక్ పెడుతూ నిర్మాతలు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. “చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం, ఇప్పటి కాలానికి పరీక్షగా నిలుస్తుంది. చిన్న చిన్న వివరాలు కూడా పరిశోదించడానికి.. వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది.
అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని నమ్ముతున్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం” అంటూ వెల్లడించారు.
అంతేకాదు సెట్ లోని పవన్ కళ్యాణ్ వర్కింగ్ స్టిల్స్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ వార్త తెలిసిన అభిమానులు ఖుషి అవుతున్నారు.