Hari Hara Veera Mallu: పవర్ గ్లాన్స్‌కు టైం ఫిక్స్ చేసిన వీరమల్లు.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. హరి హర వీరమల్లు మూవీ నుండి ఓ ‘పవర్ గ్లాన్స్’ను అభిమానులకు ట్రీట్‌గా ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు ‘పవర్ గ్లాన్స్’ను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Hari Hara Veera Mallu Power Glance Time Locked

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Hari Hara Veera Mallu Update: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పూనకాలు తెప్పించే అప్డేట్ రానుంది..?

దీంతో ఎంతోకాలంగా ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు పవన్ అండ్ టీమ్ రెడీ అయ్యింది. హరి హర వీరమల్లు మూవీ నుండి ఓ ‘పవర్ గ్లాన్స్’ను అభిమానులకు ట్రీట్‌గా ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ మేరకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు. ఈ సినిమా నుండి వచ్చే ‘పవర్ గ్లాన్స్’ను పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకులు, అభిమానులు ఈ పవర్ గ్లాన్స్ ఎలా ఉండబోతుంది, ఇది సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు కూడా అప్పుడే వస్తాడా..?

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, అందాల భామ నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌ను ఓ రేంజ్‌లో వాడనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. మరి ఈ సినిమాలోని పవర్ గ్లాన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.