Hari Hara Veera Mallu: హరి హర వీరమల్లు కూడా అప్పుడే వస్తాడా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో చిత్ర నిర్మాత ఏఎం.రత్నం ఓ క్లారిటీ ఇచ్చారు.

Hari Hara Veera Mallu Makers Planning To Release Movie In March
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఫాంటెసీ హిస్టారికల్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ ఓ సరికొత్త లుక్‌లో కనిపంచనున్నాడు.
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ కూడా లైన్‌లో ఉన్నాడా..?
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు చేరుకోగా, ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో చిత్ర నిర్మాత ఏఎం.రత్నం ఓ క్లారిటీ ఇచ్చారు. మీడియా వారితో తాజాగా మాట్లాడిన ఏఎం.రత్నం హరిహర వీరమల్లు చిత్రాన్ని 2023 మార్చి 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Hari Hara Veera Mallu: క్రేజీ అప్డేట్.. వెయ్యి మంది యోధులతో పవర్ స్టార్ ఫైట్?
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నామని.. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండియా వైడ్‌గా అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయమని ఏఎం.రత్నం అన్నారు. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎంఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.