Hari Hara Veera Mallu Ready For Next Schedule Shooting
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఫిక్షన్ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇటీవల ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ను ముగించుకుంది చిత్ర యూనిట్.
Hari Hara Veera Mallu: న్యూ ఇయర్ గిఫ్ట్‌ను వీరమల్లు రెడీ చేస్తున్నాడా..?
కాగా, ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌కు చిత్ర యూనిట్ రెడీ అయ్యిందట. దీనికోసం ఓ భారీ సెట్‌ను కూడా రెడీ చేశారట చిత్ర యూనిట్. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్‌లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహిలు పాల్గొంటారని తెలుస్తోంది. వారితో పాటు పలువురు కీలక ఆర్టిస్టులు ఈ షెడ్యూల్‌లో వర్క్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’పై ప్రొడ్యూసర్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
అయితే, పవన్ కల్యాణ్ ఈ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉందట. ఇక ఈ షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏఎం.రత్నం ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.