Hari Hara Veera Mallu Teaser On New Year Day
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను పీరియాడిక్ ఫిక్షన్ కథగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.
HariHara Veeramallu Workshop : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూట్ వర్క్‌షాప్
ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించేయాలని పవన్ భావిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుండి కేవలం పోస్టర్స్, ఓ వీడియో గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుండి మరో అప్డేట్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులు కోరుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ రోజున ప్రేక్షకులకు ఓ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు వీరమల్లు రెడీ అవుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Hari Hara Veeramallu: పవన్ హిస్టారికల్ సినిమా.. యాక్షన్ రిహార్సల్స్ వీడియో రిలీజ్!
న్యూ ఇయర్ కానుకగా పవన్ నటించిన ‘ఖుషి’ సినిమా రీ-రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా రీ-రిలీజ్‌తో పాటు ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ను థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో సోషల్ మీడియాలో ఈ సినిమా మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. కానీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో ఈ సినిమా నుంచి నిజంగానే న్యూ ఇయర్ గిప్ట్ రాబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.