Naa Telugodu
Naa Telugodu : హరినాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వ నిర్మాణంలో డ్రీం టీం ప్రొడక్షన్స్ పై హరినాథ్ పోలిచర్ల హీరోగా తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘నా తెలుగోడు’. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ హరినాథ్ పోలిచర్ల నేడు మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాని డిసెంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.(Naa Telugodu)
Also Read : Rahul Sipligunj : ప్రేయసితో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి.. సీఎం రేవంత్ కు ప్రత్యేక ఆహ్వానం..
హరినాథ్ పోలిచర్ల మాట్లాడుతూ.. నా తెలుగోడు సినిమా షూటింగ్, సెన్సార్ పూర్తిచేసుకుని డిసెంబర్ 12వ తేదీన రిలీజ్ కానుంది. ఒక సైనికుడు దేశం కోసం జీవితం త్యాగం చేయడం, ఆడపిల్లలను కాపాడటంపై, డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడటం అనే పలు అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాము. ఎన్టీఆర్ గారి ప్రేరణతోనే ఈ టైటిల్ పెట్టాను. ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలు గోవా, మునార్, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో షూట్ చేసాము. నేను డాక్టర్ అయినా యాక్టింగ్ – డాక్టర్ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ సినిమాను హిందీలో RK పేరిట రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాలో మా అమ్మ పాత్రను నిజంగా మా అమ్మ నుండి ప్రేరణగా తీసుకొని రాశాను అని అన్నారు.
Also See : Akhanda 2 : ‘అఖండ 2’ జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య బాబు స్టెప్స్ అదుర్స్..