Rahul Sipligunj : ప్రేయసితో రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి.. సీఎం రేవంత్ కు ప్రత్యేక ఆహ్వానం..
రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టు లో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు.(Rahul Sipligunj)
Rahul Sipligunj
Rahul Sipligunj : ప్రైవేట్ ఆల్బమ్స్ తో పేరు తెచ్చుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆ తర్వాత సినిమాల్లో కూడా బిజీ అయ్యాడు. నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ స్టేజి మీద కూడా పర్ఫార్మ్ చేసి స్టార్ సింగర్ అయ్యాడు. రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టు లో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు.(Rahul Sipligunj)
రాహుల్ సిప్లిగంజ్ – హరిణ్య రెడ్డి వివాహం నవంబర్ 27న ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని తన వివాహానికి ఆహ్వానించాడు. సీఎం రేవంత్ రెడ్డి వివాహానికి వస్తాను అని చెప్పినట్టు సమాచారం.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల భారీ నజరానా ప్రకటించి అందచేశారు.
