Harish Shankar : పవన్ మూవీ పక్కన పెట్టేసి… రవితేజతో సినిమా అనౌన్స్ చేసిన హరీష్ శంకర్..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పక్కన పెట్టేసి రవితేజతో సినిమా అనౌన్స్ చేసిన హరీష్ శంకర్.

Harish Shankar announce movie with Raviteja to shelve Ustaad Bhagat Singh

Harish Shankar : హరీష్ శంకర్ కెరీర్ స్టార్టింగ్ లో రవితేజతో మిరపకాయ, పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చి.. ఇండస్ట్రీలో సూపర్ ఫేమ్ ని అందుకున్నారు. ఈ దర్శకుడు ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలతో కలిసి సినిమాలు చేయబోతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ చేసిన హరీష్ శంకర్.. ఇప్పుడు రవితేజతో సినిమా ప్రకటించేశారు. ఉస్తాద్ కి సంబంధించిన ఒక షెడ్యూల్ మాత్రమే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో.. ఆ సినిమాకి బ్రేక్ పడింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయ్యేవరకు ఉస్తాద్ షూటింగ్ పట్టాలు ఎక్కేది లేదు. ఆ తరువాత కూడా OG, వీరమల్లు షూటింగ్స్ కూడా ఉన్నాయి. దీంతో హరీష్ శంకర్ దాదాపు వచ్చే ఏడాది మధ్య వరకు ఖాళీగా ఉండనున్నారు. మరో పక్క రవితేజ కూడా దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా అనౌన్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. దీంతో ఇప్పుడు ఆయన డేట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇక ఇద్దరికీ వచ్చిన ఈ గ్యాప్ ని కలిసి పూరించడానికి సిద్ధమయ్యారు. పవన్ సినిమాని పక్కన పెట్టేసి హరీష్ శంకర్, రవితేజ సినిమాని పట్టాలు ఎక్కించనున్నారు.

Also read : Vyooham : ఆర్జీవీ ‘వ్యూహం’కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో రిలీజ్..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతోంది. మరి ఈ సినిమా ఒరిజినల్ స్టోరీతో వస్తుందా..? లేదా రీమేక్ గా వస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ మూవీ షూటింగ్ ని ఎప్పుడు మొదలు పెట్టనున్నారు..? నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ అనౌన్స్‌మెంట్ రవితేజ అభిమానులు ఫుల్ ఖుషి అవుతుంటే, పవన్ అభిమానులు మాత్రం బాధ పడుతున్నారు. కాగా రవితేజ ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.