Harish Shankar : పవర్ స్టార్ అయిపోయింది.. హరీష్ శంకర్ నెక్స్ట్ టార్గెట్ మెగాస్టార్.. చిరు ఏమంటారో?

ఈ సినిమా హిట్ అయితే మరోసారి హరీష్ రేంజ్ పెరగడం ఖాయం. ఉస్తాద్ తర్వాత హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి అని చర్చ మొదలయింది. (Harish Shankar)

  • Published On : March 17, 2026 / 03:59 PM IST

Harish Shankar

Harish Shankar : హరీష్ శంకర్ తీసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డైరెక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నారు. హరీష్ తీసిన సినిమాల్లో మూడు సినిమాలు తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఇక పవన్ కళ్యాణ్ కి అయితే గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. కానీ హరీష్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమాతో అతనిపై తీవ్ర నెగిటివిటి వచ్చింది.

గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ – పవన్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే మరోసారి హరీష్ రేంజ్ పెరగడం ఖాయం. ఉస్తాద్ తర్వాత హరీష్ నెక్స్ట్ సినిమా ఏంటి అని చర్చ మొదలయింది.

Also Read : Surekhavani : ఈతకల్లు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న హేమ, సురేఖవాణి.. డైరెక్ట్ చెట్టు నుంచి.. వీడియో వైరల్..

తాజాగా హరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవితో సినిమా ప్రాసెస్ లో ఉంది. చిరంజీవితో సినిమా కచ్చితంగా ఉంటుంది. ఆయనతో రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ లాంటి మాస్ ఎంటర్టైనర్ సినిమా చేస్తాను. చిరంజీవి గారిని పలుమార్లు కలిసాను అని తెలిపారు.

దీంతో ఉస్తాద్ తర్వాత హరీష్ చిరంజీవి సినిమానే చేస్తారేమో అని చర్చ మొదలయింది. గతంలో చిరంజీవితో ఓ యాడ్ డైరెక్ట్ చేసాడు హరీష్ శంకర్. అప్పుడు చిరు నుంచి హరీష్ కి మంచి ప్రశంసలే వచ్చాయి. అయితే చిరంజీవి ఇటీవలే మన శంకర వరప్రసాద్ సినిమాతో భారీ హిట్ కొట్టారు. లైనప్ కూడా యువ దర్శకులతో క్రేజీగా ప్లాన్ చేసుకుంటున్నారు చిరు. ఆల్రెడీ ఓకే చేసిన కొన్ని సినిమాలని కూడా పక్కన పెట్టేసారు చిరు.

Also Read : Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్.. పవన్, రాశీఖన్నా, శ్రీలీల.. ఎవరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు..?

మరి ఇలాంటి సమయంలో చిరంజీవి హరీష్ శంకర్ కి ఛాన్స్ ఇస్తారా? హరీష్ తన కథతో చిరుని మెప్పిస్తారా చూడాలి. ఆల్రెడీ హరీష్ శంకర్ మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లతో సినిమాలు చేసారు.