Harish Shankar : చోటా కె నాయుడు పై హరీష్ శంకర్ ఫైర్.. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ..
తనని అవమానపరిచేలా కామెంట్స్ చేసిన చోటా కె నాయుడు పై హరీష్ శంకర్ ఫైర్. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ..

Harish Shankar released serious press note about Chota K Naidu comments
Harish Shankar : హరీష్ శంకర్, జూనియర్ ఎన్టీఆర్ తో ‘రామయ్య వస్తావయ్య’ సినిమా చేశారు. దీని చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ. అయితే ఆ సినిమా హరీష్ శంకర్ తన పనికి అడ్డుపడేవాడని, తన మాట పట్టించుకునేవాడు కాదని.. చోట కె నాయుడు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.
#ChotaKNaidu about #HarishShankar Behavior at Movie Shooting of #RamayyaVasthavayya.. pic.twitter.com/2m57xIud9D
— Filmy Bowl (@FilmyBowl) April 19, 2024
ఇక ఈ కామెంట్స్ కి హరీష్ శంకర్ రియాక్ట్ అవుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. “రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో మీరు ఓ 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాను. కానీ నేను ఎప్పుడూ ఎక్కడా మీ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం చాలాసార్లు నన్ను అవమానపరిచేలా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఆ సినిమా చేస్తున్న సమయంలో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్ తో షూటింగ్ చేద్దాం అనుకున్నాము.
Also read : Vishal : విశాల్‌నే పెళ్లి చేసుకుంటా అంటూ యాంకర్.. సిగ్గుతో ఇబ్బందిపడిన హీరో..
కానీ దిల్ రాజుగారు చెప్పడం వల్ల, అలాగే గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్ ని తీసేస్తున్నాడని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని భయంతో.. మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కానీ ఏ రోజు ఆ నిందని నేను మీ మీద మోపలేదు. ఎందుకంటే హిట్ వస్తే నాది ప్లాప్ వస్తే మీది అనే మెంటాలిటీ నాది కాదు. కానీ మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగినా, అడగకపోయినా,
నా ప్రస్తావన వచ్చినా, రాకున్నా, నన్ను అవమానపరిచేలా మాట్లాడుతున్నారు.
ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే ఉన్నాను. కానీ నా అన్నవాళ్ళు కూడా నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. మీతో పని పని ఇబ్బంది కలిగించినా.. మీ అనుభవం నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి. లేదు ఇంకా అలాగే మాట్లాడతా అంటే.. నేను ఎక్కడికైనా వస్తా డెబిట్‌కి” అంటూ నోట్ రిలీజ్ చేశారు. మరి దీని పై చోట కె నాయుడు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.