Harish Shankar : తెలంగాణ రాజకీయాల్లోకి హరీష్ శంకర్..? పవన్ కామెంట్స్ వైరల్..
ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సినిమాకు పనిచేసిన వారి గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు. (Harish Shankar)
- Saketh U
- Published On : March 16, 2026 / 04:36 PM IST
Harish Shankar
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
హరీష్ శంకర్ పై పవన్ కామెంట్స్
రాజకీయాల్లోకి హరీష్..?
Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నిన్న ఆదివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు, సినిమాకు పనిచేసిన వారి గురించి, పలు అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ గురించి గొప్పగా మాట్లాడారు. పవన్ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండి రోజూ ఇచ్చిన టైం లోనే షూటింగ్ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని 45 రోజుల్లోనే షూట్ పూర్తి చేయడంతో పవన్ హరీష్ ని అభినందించారు.
Also Read : Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ టీజర్ వచ్చేసింది.. 20 ఏళ్ళు పెద్దవాడితో ప్రేమ..
అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మీలో ఒకడు దర్శకుడు అయితే అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు. నన్ను ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా కావాలని పట్టు పట్టి చేయించే దర్శకుడు. ఈ సినిమా రావడానికి ఒక్కడే కారణం అది హరీష్ శంకర్. హరీష్ శంకర్ కి అనవసరమైన గొడవలకు, కాంట్రవర్సీలకు వెళ్లొద్దు, వదిలేయి అని చెప్తాను. ఎవరైనా ఏదన్నా అంటే కౌంటర్ ఇచ్చేస్తాడు. హరీష్ ఏదో ఒకరోజు తెలంగాణ నేల కోసం పనిచేస్తాడు. భారతదేశానికి కూడా పనిచేస్తాడు. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, దర్శకుడు, డైలాగ్ రైటర్. హరీష్ శంకర్ ప్లానింగ్ పర్ఫెక్ట్. చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి హరీష్ అంటూ హరీష్ శంకర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.
అయితే హరీష్ ఏదో ఒక రోజు తెలంగాణ నేల కోసం పనిచేస్తాడు అంటూ మాట్లాడటంతో హరీష్ కూడా భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వస్తాడా, తెలంగాణలో జనసేన తరపున యాక్టివ్ గా ఉంటారా అనే చర్చ మొదలయింది. ఇప్పటికే జనసేనలో చాలా మంది నిర్మాతలు, నటీనటులు యాక్టివ్ గానే ఉన్నారు. తెలంగాణలో కూడా RK సాగర్, తనీష్, పలువురు చిన్న ఆర్టిస్టులు జనసేన తరపున ప్రచారాలు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో భవిష్యత్తులో హరీష్ శంకర్ కూడా చేరుతాడా, హరీష్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా తెలంగాణలో పోటీ చేస్తాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : Pawan Kalyan : ఆ హీరోయిన్ ని రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కళ్యాణ్.. ఏం చెప్పిందో తెలుసా?
