Gnanasagar Dwaraka : సినిమా షూటింగ్ ప్రతి షెడ్యూల్‌లో.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రూపంలో కనిపించాడు..

తాజాగా హరోంహర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Gnanasagar Dwaraka : సినిమా షూటింగ్ ప్రతి షెడ్యూల్‌లో.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ రూపంలో కనిపించాడు..

HaromHara Director Gnanasagar Dwaraka Says Interesting Thing about Movie Shooting

Gnanasagar Dwaraka : సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘హరోంహర’. 1990’s బ్యాక్‌డ్రాప్‌ తో రూరల్ గ్యాంగ్ స్టార్ కథాంశంతో ఈ సినిమా రానుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మాణంలో జ్ఞానసాగర్ ద్వారకా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరోంహర సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

Also Read : Aishwarya Arjun : ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు వివాహం.. ఫొటోలు వైరల్..

తాజాగా హరోంహర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. జ్ఞానసాగర్ ద్వారకా మాట్లాడుతూ.. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిని. బాగా నమ్ముతాను. అందుకే సినిమా టైటిల్ హరోంహర అని, హీరో క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం అని పెట్టాను. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న ప్రతి షెడ్యూల్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం నెమలి కనిపించింది. కర్ణాటక, ఏపీ, హైదరాబాద్ లో కూడా.. షూటింగ్ చేసిన ప్రతి షెడ్యూల్ లో మాకు ఏదో ఒకరోజు నెమలి కనిపించింది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు ఆ రూపంలో తోడున్నాడు అనిపించింది అని తెలిపారు. దీంతో హరోంహర డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.