×
Ad

Harshavardhan Rameshwar: యానిమల్ ఎఫెక్ట్.. మ్యూజిక్ డైరెక్టర్ దశ తిరిగిపోయింది.. త్రివిక్రమ్, పూరి సినిమాలు సెట్టు

ఒక విజయం.. ఒకే ఒక్క విజయం చాలు సినిమా ఇండస్ట్రీలో(Harshavardhan Rameshwar) కొంతమంది జీవితాలు మారిపోవడానికి. కానీ, ఆ విజయం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్.

Harshavardhan Rameshwar is composing music for Trivikram and Puri Jagannadh's films.

Harshavardhan Rameshwar: ఒక విజయం.. ఒకే ఒక్క విజయం చాలు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది జీవితాలు మారిపోవడానికి. కానీ, ఆ విజయం రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఫేజ్ లో ఉన్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. నిజానికి అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల ముందు వరకు ఈ పేరు పెద్దగా తెలియదు. కానీ, ఈ రెండు సినిమాలకు ముందు కూడా ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా సినిమాలే చేశాడు. (Harshavardhan Rameshwar)కానీ, సక్సెస్ రాలేదు. యానిమల్ సినిమా తరువాత ఆయన పేరు సంచనలంగా మారింది. ఈ ఒక్క సక్సెస్ తో వరుసగా భారీ అవకాశాలు అందుకుంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.

Bunny Vas: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలెర్ట్.. AA22 మూవీ రిలీజ్ డేట్ చెప్పిన బన్నీ వాస్.. ఇక రచ్చ షురూ..

ప్రస్తుతం హర్షవర్ధన్ రామేశ్వర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ అయ్యాయని దర్శకుడు చెప్పేశాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ నేపధ్యంలోనే తాజాగా మరో రెండు భారీ సినిమాలకు ఒకే చెప్పేశాడు హర్షవర్ధన్. వాటిలో మొదటిది పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా. విజయ్ సేతుపతి బిచ్చగాడిగా చేస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని అందించే అవకాశాన్ని హర్షవర్ధన్ రామేశ్వర్ దక్కించుకున్నాడు.

ఇక టాలీవుడ్ మరో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాను విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలయ్యింది. అనౌన్స్ మెంట్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 8వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ ప్రెస్టీజియస్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశాన్ని హర్షవర్ధన్ దక్కించుకున్నాడు. ఇలా యానిమల్ సినిమా అందించిన ఒకే ఒక్క భారీ విజయంతో తన దశనే మార్చేసుకున్నాడు హర్షవర్షన్ రామేశ్వర్. వరుసగా స్పిరిట్, పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ లతో సినిమాలకు పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మరి ఈ సినిమాలకు ఆయనకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి చూడాలి.