Bunny Vas: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలెర్ట్.. AA22 మూవీ రిలీజ్ డేట్ చెప్పిన బన్నీ వాస్.. ఇక రచ్చ షురూ..

పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు (Bunny Vas)ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ లెవల్లో భారీ విజయాన్ని సాధించింది.

Bunny Vas: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అలెర్ట్.. AA22 మూవీ రిలీజ్ డేట్ చెప్పిన బన్నీ వాస్.. ఇక రచ్చ షురూ..

Producer Bunny Vas gives update on the release of Allu Arjun and Atlee's film

Updated On : October 9, 2025 / 10:54 AM IST

Bunny Vas: పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గ్లోబల్ లెవల్లో భారీ విజయాన్ని సాధించింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అయితే రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అప్పటినుంచి అల్లు అర్జున్ తరువాతి సినిమా గురించి ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ తమిళ దర్శకుడు అట్లీతో ఒక భారీ సినిమాను ఒకే చేశాడు అల్లు అర్జున్. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే(Bunny Vas) మొదలయ్యింది.

Nayanthara: ఇండస్ట్రీలో 22 ఏళ్ళు.. నన్ను నన్నుగా మార్చాయి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నయనతార

ఈ ప్రాజెక్టుకి సంబందించిన అనౌన్స్ మెంట్ వీడియోకి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక రేంజ్ లో ఉండబోతుంది అని జస్ట్ హింట్ ఇచ్చి వదిలారు మేకర్స్. అప్పటినుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని ఆడియన్స్ మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపధ్యంలోనే తాజాగా అల్లు అర్జున్, అట్లీ సినిమా విడుదల గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు నిర్మాత బన్నీ వాస్. ఆయన నిర్మాతగా వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న బిన్నీ వాస్ అల్లు అర్జున్ సినిమా విడుదల గురించి చెప్తూ.. “అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ని సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారు” అంటూ చెప్పుకొచ్చాడు. దాంతో ఆ కామెంట్ కాస్తా వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలియడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అంటే తప్పకుండా ఈ సినిమా 2026లోనే విడుదల అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ వాస్ ఇచ్చిన ఈ చిన్న అప్డేట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మరి చిన్న అప్డేట్ కె ఈ రేంజ్ లో ఉంటే సినిమా రిలీజ్ అయ్యాక ఆ హంగామా ఏ రేంజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు.